ప్రధాని మోదీ మాటకు ఆశ్చర్యపోయాను.. స్టార్ హీరో నాగార్జున కామెంట్స్ వైరల్!

Reddy P Rajasekhar
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా తొలిసారి మోదీని కలిసిన అనుభవం గురించి నాగార్జున పంచుకోగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రధాని గురించి మాట్లాడటాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని నాగ్ అన్నారు. 2014 సంవత్సరంలో గాంధీ నగర్ లో మోదీని తొలిసారి కలిశానని నాగ్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటకు ఆశ్చర్యపోయానని నాగ్ చెప్పుకొచ్చారు.

మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మిమ్మల్ని మైసూరులో మీట్ అయ్యారని వాళ్ళు మీ గురించి ఎన్నో విషయాలు చెప్పారని వాళ్లెవరో మీకు తెలియాకపోయినా మీరు ఫోటో దిగడానికి అంగీకరించారని మోదీ  చెప్పడంతో తాను  ఆశ్చర్యపోయానని నాగ్ కామెంట్లు చేశారు.  ఆ విషయాలను గుర్తు చేసుకుని మరీ మోదీ  చెప్పడం  ఆశ్చర్యానికి గురి చేసిందని నాగ్ అన్నారు.  ఎప్పుడూ  వినయంగా, సానుభూతితో ఉండాలని  మనిషికి అవే  ముఖ్యమని నాగ్ పేర్కొన్నారు.  

అక్కినేని నాగేశ్వరరావు సినీ లెజెండ్స్ లో ఒకరంటూ  మన్  కీ బాత్ లో మోడీ మా నాన్న గురించి చెప్పడం ఎంతో  సంతోషాన్ని కలిగించిందని  నాగార్జున కామెంట్లు చేశారు. నాగార్జున కెరీర్ విషయానికి వస్తే ఈ ఏడాది నాగార్జున కూలీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచినా  ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ప్రస్తుతం నాగార్జున తన 100వ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారని తెలుస్తోంది.  నాగార్జున 100వ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం  అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తర్వాత ప్రాజెక్ట్ లతో నాగ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని  ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: