వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వనున్న దువ్వాడ..కారణం అదేనా..?
కానీ ఆ మధ్య కొన్ని వివాదాల నేపథ్యంలో వైసిపి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తన సస్పెండ్ వెనుక కూడా చాలామంది కీలకమైన నేతలు ఉన్నారు అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఇటీవలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుకోకుండా దువ్వాడ టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్ కు మద్దతు ఇచ్చారు. మరొకవైపు తనకు జగన్ దేవుడు లాంటి వ్యక్తి అని.. త్వరలోనే వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తానంటూ చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గానికి బలమైన నేతగా పేరు సంపాదించారు దువ్వాడ శ్రీనివాస్.
కానీ తన వ్యక్తిగత కారణాలవల్ల ఇటీవలే కాలంలో చాలా వివాదంగా మారారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వైసిపి పార్టీకి శ్రీకాకుళంలో పెద్దగా పట్టు కనిపించడం లేదు. అక్కడ టిడిపికి కంచుకోటగా కింజరావు కుటుంబం హవా ఎక్కువగానే ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో బలమైన సామాజిక కూర్పుతోనే ముందుకు వెళితే తమకు అనుకూలిస్తుందని వైసిపి ఆలోచిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీలోకి దువ్వాడ రీయంట్రి ఇవ్వడం కూడా కొంత కలిసి వస్తుందని భావన వారిలో కనిపిస్తోంది. అన్నీ అనుకూలిస్తే టెక్కలిలో 2029 వైసీపీ పార్టీ నుంచి దువ్వాడే పోటీ చేస్తారని వినిపిస్తున్నాయి. దీంతో దువ్వాడ రీఎంట్రీ పైన ఇప్పుడు ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. దువ్వాడ పైన వేసిన సస్పెన్షన్ వేటుని వైసీపీ అధినాయకత్వం ఉపసంహరించుకుంటుందా? లేదా అన్న విషయం చూడాలి మరి.