ఏపీ సీఎం:అసంపూర్తిగానే సూపర్ సిక్స్ హామీలు.. ఆ రెండు గుర్తు లేవా..?
కానీ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రెండు పథకాలను మాత్రం నెరవేర్చకుండానే "సూపర్ సిక్స్ - సూపర్ హిట్" అనే సభను పెట్టడంతో చాలామంది రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు కావోస్తోంది. సూపర్ సిక్స్ హామీలను నిజంగానే అమలు చేయలేదని అటు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఆడబిడ్డ నిధి, యువగళం నిధి అనేవి అమలు చేయలేదు. సూపర్ సిక్స్ లో మిగిలిన వాటిలో కూడా కొంతమేరకు డొల్లతనం ఉందని తెలియజేస్తున్నారు.
అయితే గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో పోలిస్తే కొంతమేరకు బెటర్ అని చెబుతున్నారు. అనంతపురంలో జరిగిన సూపర్ హిట్ సభకు లక్షలాదిమందిని తీసుకువెళ్లారు. సుమారుగా జిల్లాల నుంచి తరలించారు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ముఖ్యంగా సభలో లక్షలాదిమందిని చూపించాలని..తాము పెట్టిన సక్సెస్ మీటింగ్ తో. ప్రజలలో మాకి ఇంత బలం ఉందని చూపించాలేనే ఉద్దేశంతోనే ఈ సక్సెస్ మీట్ చేసినట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.
మిగిలిన రెండు పథకాలు పూర్తి చేసిన తర్వాత మీటింగ్ పెట్టి ఉంటే బాగుండు అంటూ కూడా తెలుపుతున్నారు. కానీ ఇప్పుడు ఒక అబద్ధాన్ని ప్రచారం చేసినట్టుగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఈ మీటింగ్ వల్ల చుట్టుపక్కల ఉండే కంపెనీలు ,స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చేశారు. స్కూల్లో బస్సులు, కాలేజీల బస్సులు , కంపెనీ బస్సులను కూడా ఉపయోగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఇలా చేస్తే తప్పు పట్టిన కూటమి నేతలు.. కానీ ఇప్పుడు చేసిన పని కూడా అదే కదా అంటూ విశ్లేషకులు తెలుపుతున్నారు.TDP సోషల్ మీడియాలో, మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేశారు.
కానీ క్యాడర్లో కూడా సూపర్ సిక్స్ హామీల విషయంపై ఫీడ్ బ్యాక్ నెగిటివ్ గానే ఉందంటూ చెబుతున్నారు. ఈ మీటింగ్ కోసం సుమారుగా వారం నుంచి చాలామంది మంత్రులు, నేతలు, అధికారులు కూడా పనిచేశారు. దీన్ని బట్టి చూస్తే గత ప్రభుత్వం చేసిన తప్పులను.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు తెలుపుతున్నారు. మరి ఇకనైనా మహిళలకు రూ .1500, నిరుద్యోగులకు రూ .3000 రూపాయలు ఇచ్చి చెప్పిన హామీలను నెరవేర్చామని చెబుతారో లేదో చూడాలి మరి.