జగన్: సూపర్ సిక్స్ అబద్దాలే సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్.. !

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను, వారి సమస్యలను అసలు పట్టించుకోవడం లేదంటూ తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో భాగంగా సీఎం చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు గొప్పలు చెప్పి.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులని పప్పులు, బెల్లాలకి అమ్మేస్తున్నారంటూ పలు రకాల ఆరోపణలు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కూడా కలుగుతోందంటూ ఫైరయ్యారు.


తన సొంత జిల్లా అయిన కుప్పంలో కూడా రైతుల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా ఉందని , రాష్ట్ర ప్రజలకు అసలు సంక్షేమమే అందనివ్వకుండా చేస్తున్నారు. సూపర్ సిక్స్ అంటు ప్రజలను మోసం చేశారని.. మళ్లీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభలు, సంబరాలు  చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబే .. దోచుకో పంచుకో తినకో అన్న కాన్సెప్ట్ తోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉందంటూ ఫైర్ అయ్యారు. 2019 వరకు చంద్రబాబు మూడుసార్లు సీఎంగా చేశారు  ఏ ఒక్క కాలేజ్ అయినా కట్టారా అంటూ ఫైరయ్యారు.



వైసిపి హయాంలో రైతులు ఎప్పుడూ కూడా మందుల కోసం, ఎరువుల కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు. సీఎంగా మారిన తర్వాతే రైతులకు ఇలాంటి కష్టాలు వచ్చాయి అంటూ ప్రశ్నించారు? తాము రైతులకు మంచి చేయాలనుకున్నాము కాబట్టి ఎప్పుడూ కూడా యూరియా కొరత లేకుండా చేశామని.. రైతులకు సబ్సిడీ కింద ఇస్తున్న ఎరువులని టిడిపి నేతలు పక్కదారి పట్టించి ఎరువుల కొరత వచ్చేలా సృష్టిస్తున్నారని జగన్ ఆరోపణలు చేశారు. ఇదంతా కూడా రూ.250 కోట్ల రూపాయలు స్కామ్ అని.. ఇలాంటి బ్లాక్ మార్కెటింగ్ పైన చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ ప్రశ్నించారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: