ఏపీ పిఠాపురం: ముద్రగడతో వర్మ భేటీ.. వైసీపీలోకి ఎంట్రీనా..?

Divya
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం నిరంతరం ఎప్పుడు ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ఇక్కడ టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ కచ్చితంగా గెలిచే సీటును త్యాగం చేయడం పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేయడం వల్లే గెలిచారని అక్కడ టిడిపి కార్యకర్తలు భావిస్తూ ఉంటారు. కానీ జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఎన్నికల ముందు వర్మకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతానంటూ పవన్ కళ్యాణ్ , చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా ఏ విధమైనటువంటి పదవి ఇవ్వలేదు.


ఇప్పుడు తాజాగా వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డితో భేటీ కావడం మరొకసారి వర్మ పేరు సంచలనంగా మారుతోంది. దీంతో ఈ భేటీ వెనుక వర్మ టిడిపి నుంచి వైసీపీ పార్టీలోకి వస్తున్నారనే ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వర్మ అనుచరులు కూడా పిఠాపురం సీటును త్యాగం చేసినప్పటికీ ఆయనకి  తగిన గుర్తింపు లభించలేదంటూ వర్మ అనుచరులు కూడా ఆవేదనని తెలియజేస్తున్నారు.


కానీ  ఇటీవలే వర్మకు ఒక కీలకమైన  పదవి ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అందులో భాగంగానే వర్మకు కూడా గన్ మెన్లను కేటాయించడమే అందుకు నిదర్శనం అన్నట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో వర్మ ముద్రగడ పద్మనాభంను కలవడం వెనుక మర్మమేంటి అనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.  వినిపిస్తున్న ప్రకారం  గడిచిన కొద్ది రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడ్డారు. చికిత్స అనంతరం ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ముద్రగడను చాలామంది సీనియర్ నాయకులు కూడా పరామర్శించారు. అందులో భాగంగానే వర్మ కూడా మర్యాదపూర్వకంగా వెళ్లి కలుసుకున్నట్లు  తెలుస్తోంది. వైసీపీ పార్టీలో చేరుతారనే విషయం పై మాత్రం కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు కొట్టి పారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: