వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల‌కు ఎందుకీ గ‌తి ప‌ట్టింది...?

RAMAKRISHNA S.S.
రెండు తెలుగు రాష్ట్రాలు అయినా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వైసిపి - బీఆర్ఎస్ రెండు పార్టీలలో ఇప్పుడు కుటుంబ గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. రాజకీయాలలో పార్టీ ఇమేజి పెద్దదిగా ఉండాలా ?అధినేత ఇమేజ్ గొప్పగా ఉండాలా ? అనేది సాధారణంగా మనం అంత సీరియస్గా గమనించే విషయం కాదు. కానీ ఈ ప్రశ్నకు చాలా ప్రాధాన్యం ఉంది. రాజకీయాల్లో ఎక్కువకాలం ఉండాలని కోరుకునే వారు ఖచ్చితంగా పార్టీ ఇమేజ్ పెద్దగా ఉండాలని భావిస్తారు. అలా కాకుండా వ్యక్తి ఇమేజ్ పెద్దగా ఉంటే తానే సుప్రీం .. మోనార్క్ అని భావిస్తే పార్టీ ప్రభావం మొత్తం ఆ వ్యక్తి చరిష్మా మీద నడుస్తుంది. అయితే కాలగమనంలో వ్యక్తి ఇమేజ్ దెబ్బతింటే ఆటోమేటిక్గా పార్టీ కుప్పకూలుతుంది. ఇది తెలుసుకునేలాగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది.


అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కేసీఆర్ ఏక చక్రాధిపత్యంగా తెలంగాణను పాలించారు. అయితే బి.ఆర్ కంటే కేసీఆర్ ఇమేజ్ అక్కడ ప్రధాన ఆకర్షణ. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కెసిఆర్ ఇమేజ్ మస‌క భారినప్పుడు పార్టీ గ్రాఫ్ శ‌ర‌వేగంగా పతనమవుతుంది. ఎప్పుడు అయితే సొంత కుటుంబంలోనే కుమార్తె పార్టీపై తిరుగుబావుటా ఎగ‌ర‌వేసిందో పార్టీ వీక్ అయ్యింది. అదే బీఆర్ఎస్ అనే పార్టీ స్ట్రాంగ్‌గా ఉంటే ఈ ప‌రిస్థితి ఉండేదే కాదు. ఏపీలోనూ జ‌గ‌న్ ఒక్క‌డే వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు వ‌న్ మ్యాన్ షో చేశారు. చివ‌ర‌కు చెల్లి ష‌ర్మిల‌, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి దూరం కావ‌డం.. పార్టీ ఓడిపోవ‌డంతో ఇప్పుడు వైసీపీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: