తురకపాలెం:40 మంది మృతి..మరణాల మిస్టరీ కోసం రంగంలోకి చంద్రబాబు..!
ముఖ్యంగా అక్కడ చెరువులో ఉండేటువంటి నీటిని కూడా పరీక్ష చేయించడానికి పంపించారు. తురకపాలెంలో కేవలం రెండు నెలల వ్యవధిలోని 40 మందికి పైగా మరణించారు. అసలు ఆ గ్రామంలో ఎందుకు చనిపోతున్నారనే విషయం ఇప్పటికీ ప్రభుత్వానికి అంత చిక్కడం లేదు. అసలు ఈ మరణాల వెనుక దాగివున్న మిస్టరీ చేదించడానీకే.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకించి మరి దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ రోజున తుది నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు చంద్రబాబు.
అయితే ఈ అంతు చిక్కని మరణాల వెనుక తురకపాలెంలో ఉండే బొడ్రాయి కారణమని అక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు. ఆ బొడ్రాయి వల్లే ఇంతటి మరణాలు సంభవించాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నప్పటికీ అది మూఢనమ్మకమేనని దానివల్ల మరణాలు సంభవించడం ఉండదు అంటూ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం తురకపాలెం లోని ప్రజలకు, వైద్య పరీక్షలు అందుకు సంబంధించి వివరాలను తెలియజేస్తామని.. ఇక్కడ ప్రజలు ఎవరు భయపడకండి అంటు అధికారులు అక్కడ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.అంతేకాకుండా ప్రత్యేకించి మరి అక్కడ 24 గంటల వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. అక్కడ వారికి 'మొలియాయిడోసిస్ 'పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది.. అక్కడ ప్రజలలోని మోకాలిలో ఉండే ద్రవాన్ని సేకరించి పరీక్షకు పంపడంతో ఈ వ్యాధి నిర్ధారణ అయింది . ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటూ అధికారులు తెలుపుతున్నారు.