దేశంలో అన్ని రాష్ట్రాలలో కంటే తమిళనాడులో రాజకీయలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎంత రాజకీయం ఉన్నా కానీ వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలు రాష్ట్ర వ్యవస్థను దెబ్బతీసే విషయంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ కారు. నాయకులంతా పార్టీలకతీతంగా ఒక్కటై వారి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అలాంటి తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం స్టాలిన్ అధికారంలో ఉన్నారు. రాబోవు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్టీల విషయంలో కాస్త గందరగోళాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. అయితే తాజాగా హీరో దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కజగం' పేరుతో సరికొత్త పార్టీని స్థాపించారు. అంతేకాదు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు.
ఇదిలా నడుస్తున్న సమయంలో కూటమిగా ఉన్నటువంటి పార్టీలలో విభేదాలు ఏర్పడ్డాయి.. ఆ విభేదాలకు కారకులు ఎవరో వివరాలు చూద్దాం.. ఏఐఏడీఎంకే పార్టీలో విపరీతమైనటువంటి విభేదాలు చోటు చేసుకున్నాయి..శశికళకు బాగా దగ్గరైనటువంటి టీటీవి కి సంబంధించినటువంటి లీడర్ దినకరన్ ఒక పార్టీని స్థాపించారు. కానీ ఆ పార్టీ అంతగా పేరు రాకపోవడంతో ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన వారితో పొత్తు వద్దనుకుని బయటకు వచ్చేశారు. ఇదే సందర్భంలో పన్నీర్ సెల్వం కి సంబంధించినటువంటి మరో బ్యాచ్ ఏఐఏడిఎంకె నుంచి బయటకు వచ్చేసారు. ఈ విధంగా పొత్తుగా ఏర్పడి ఉన్నటువంటి ఏఐఏడిఎంకే పార్టీ నుంచి వీరంతా బయటకు రావడంతో, వీరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనేది చాలా ఆసక్తికరంగా మరిది.
వీరంతా డీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అంటే అది జరగదు. అంతేకాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి మరి కొంతమంది నాయకులు కూడా రాజీనామా చేస్తున్నారు. ఇలా డీఎంకే పార్టీకి ఎదురులేకుండా చేయాలని స్టాలిన్ వేసిన ప్లాన్ లో వీరంతా పడిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏఐఏ డిఎంకె పార్టీని దెబ్బతీసి బిజెపిని బలపలకుండా చేసి, వీరంతా విజయ్ వైపు వెళ్లేలా ప్లాన్ గీశారు స్టాలిన్.. దీనివల్ల డిఎంకె పార్టీ బలపడుతుందని ఆయన ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మరి స్టాలిన్ ప్లాన్ ప్రకారం వాళ్లు పూర్తిగా విడిపోయి ఇబ్బందులు పడతారా, కలిసిపోయి డీఎంకేనే ఓడిస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ పార్టీలో వీరంతా కలిస్తే విజయ్ కి రాబోయే ఎన్నికల్లో ప్లస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.