సిద్దిపేట మోడల్ చిలిపి లీలలు.. సందుల్లో దూరి.. కవిత టీం షాకింగ్ ట్వీట్.?

Pandrala Sravanthi
 గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి..ముఖ్యంగా 10 సంవత్సరాలు కలిసి ఒకే పార్టీలో ఉన్న నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది.కవిత లిక్కర్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి తిరిగి వచ్చినప్పటినుండి బీఆర్ఎస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటుంది.తండ్రిని ఏమీ అనకుండా అన్నని టార్గెట్ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని సీబిఐకి అప్పగించిన సమయంలో ఏకంగా హరీష్ రావు,సంతోష్ రావులపై కవిత సంచలన ఆరోపణలు చేసింది.హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కలిసి కాళేశ్వరంలో అవినీతి చేశారని వేల కోట్లు దండుకున్నారు అంటూ ఆరోపణలు చేసింది.


 ఇక ఈ ఆరోపణలు చేసిన వెంటనే కవితని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దాంతో కవిత మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ హరీష్ రావు సంతోష్ రావులపై విరుచుకుపడి నాన్న అన్నను కాపాడండి మీదే బాధ్యత అంటూ కుటుంబానికి సపోర్ట్ గా మాట్లాడి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. అలా గత కొద్ది రోజుల నుండి కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎన్నో విభేదాలు భగ్గుమంటున్నాయి.ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే హరీష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు చేసిందో అప్పటినుండి కవిత టీం అనే పేరు మీద ఒక ఎక్స్ ఖాతా సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది.దానికి కారణం కవిత టీం అనే పేరు మీద ఉండే ఎక్స్ ఖాతాలో బీఆర్ఎస్ కు సంబంధించి ఎన్నో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా సిద్దిపేట మోడల్ చిలిపి లీలలు అంటూ ఒక సంచలన ట్వీట్ వైరల్ అయింది.


 అందులో ఏముందంటే.. "మీరు దూరిన సంధులు గొందుల గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకండి.. రాజకీయాన్ని చాలా దిగజారి చేస్తున్నారు".. అంటూ వార్నింగ్ ఇచ్చేలా ఒక సంచలన పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ కి సిద్దిపేట మోడల్ చిలిపి లీలలు అనే టైటిల్ పెట్టి ఈ ట్వీట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కవిత టీం అనే పేజీ నుండి వచ్చిన ఈ ట్వీట్ హరీష్ రావు గురించేనని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి కవిత హరీష్ రావు గురించి ఇంకా ఎలాంటి విషయాలు బయటపెట్టబోతుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: