జగన్ కి షర్మిల.. కేటీఆర్ కి కవిత.. మరి లోకేష్ కి ఎవరు..?

Thota Jaya Madhuri
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంత హీట్ పెంచుతున్నాయో అందరికీ తెలిసిందే. అసలు రాజకీయాలంటే ఆసక్తి లేని వాళ్లు కూడా ఇప్పుడు ఏమి జరుగుతున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు. కారణం, ఈసారి రాజకీయ సమస్యలు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలతో కాకుండా సొంత పార్టీల నేతలతోనే రావడం. ప్రత్యేకంగా చెప్పాలంటే, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఎలా భారీ దెబ్బ కొట్టిందో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో జగన్ అధికారం చేపట్టకపోవడానికి ప్రధాన కారణం షర్మిలే అని అనేక రిపోర్ట్స్ చెబుతున్నాయి. షర్మిల చేసిన విమర్శలే జగన్ ప్రతిష్టను దెబ్బతీసి, ప్రజల్లో నమ్మకం తగ్గించి, ఓట్ల లోటుకు కారణమయ్యాయని వార్తలు వచ్చాయి.



ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో కేటీఆర్ చెల్లెలు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గత కొద్ది రోజులుగా కవితపై వస్తున్న రాజకీయ వార్తలు అందరికీ తెలిసినవే. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయని స్పష్టమైంది. కవితను సస్పెండ్ చేసి, ఆమె ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి. జగన్‌కి షర్మిల దెబ్బతీసినట్టే, కేటీఆర్‌కి కవిత కూడా రాజకీయంగా పెద్ద దెబ్బ కొట్టిందనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.



ఇప్పుడు అందరి దృష్టి నారా లోకేష్‌పై పడింది. జగన్‌కు షర్మిల, కేటీఆర్‌కు కవిత రాజకీయ దెబ్బలు ఇచ్చినట్లే, లోకేష్‌ను ఎవరు ఇబ్బందులు పెట్టగలరు అన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. లోకేష్‌కు అక్కా చెల్లెలు లేకపోయినా, రాజకీయంగా మాత్రం చిక్కులు తప్పవని కొందరు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల ఆయన సినిమాలకు సంబంధించి టిడిపి కుట్ర పన్నిందని బయటపడిన ఆడియో లీక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావాలని సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన సోదరి చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్వంత పార్టీ పెట్టి రాజకీయ రంగంలోకి దిగితే, లోకేష్‌కు భారీ దెబ్బ తప్పదని ప్రముఖులు భావిస్తున్నారు. అందుకే ముందుగానే లోకేష్ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: