ఆస్తి విషయంలో అన్నను షర్మిల చీటింగ్ చేసిందా..?
జగన్ కి తన తండ్రి రాజశేఖరరెడ్డి నుంచి వచ్చిన వాటాలో చెల్లి(షర్మిల) కి రూ.230 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. ఆ తరువాత జగన్ సంపాదించిన ఆస్తి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పెట్టిన వ్యాపారాలలో కాబట్టి అందులో కూడా తమకు వాటా కావాలి అంటూ షర్మిల అడగగా 40 శాతం వరకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే అలా ఇస్తున్నటువంటి సందర్భంలో జగన్ మీద చాలానే కేసులయ్యాయి. జైలుకి కూడా వెళ్లారు. దీంతో జగన్ ఆస్తులన్నీ కూడా ఈడి ,సిబిఐ సీజ్ చేసింది.
ఆ సమయంలోనే సరస్వతి సంస్థకు సంబంధించి షేర్లు అయితే ఏమున్నాయో.. వాటి మీద అటాచ్మెంట్ తీసేసింది ట్రిబ్యునల్..అలా తీసేయగానే దాన్ని తన తల్లికి రాసి.. ఆ తర్వాత కాలంలో తన చెల్లికి వెళ్ళేలా జగన్ ఎంవోయూలో రాశారు..కానీ ఈ లోపు చెల్లి అయిన షర్మిల వాటిని మార్చేసుకుంది. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండగానే.. ఆ డాక్యుమెంట్లు పోయినాయని చెప్పి ఒక ఫేక్ కంప్లైంట్ పెట్టి నోటరీ ద్వారా వాటన్నిటిని తన వైపుకి మార్చేసుకుంది. ఒకవేళ అది చట్టప్రకారం అయితే మాత్రం. ఈడీ,సీబీఐ జగన్ చెల్లికి మార్చేశారని సీజ్ లో ఉన్న ఆస్తులను ఇలా రాసేయడం తప్పు అని చెప్పి కేసు పెట్టి జగన్ బెయిల్ రద్దు చేయమని కోరదగినటువంటి అంశం అది.
కానీ ఈ విషయాన్ని గ్రహించిన జగన్.. ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. తనకు తెలియకుండానే తన తల్లి చెల్లి ఇలా చేశారని.. తాను తన చెల్లెలకు ఇద్దామనుకున్న ఆస్తి కరెక్టే అయినా.. తనని మోసం చేసి ఇలా చేశారు కాబట్టి తాను ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నానంటూ తెలిపారు. మోసపూరితంగా తీసుకున్నారు కాబట్టి దానిని చెల్లుబాటు కాకుండా చూడాలి అంటూ ఎన్సిఎల్టిలో పిటిషన్ వేయగా అది జగన్ కు అనుకూలంగానే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ తీర్పుని కొట్టేయండి అంటూ.. చెన్నైలో ఎన్సీఎల్టీలో షర్మిల పిటిషన్ వేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.