ఏపీ:లిక్కర్ స్కామ్ కేసులో జగన్ హస్తం ఉన్నట్టా? లేనట్టా..?
చెవిరెడ్డి, విజయానంద రెడ్డి కంపెనీల లావాదేవీలకు సంబంధించి నిన్నటి రోజున తిరుపతి ,హైదరాబాద్, చిత్తూరు వంటి ప్రాంతాలలో కూడా శోదాలు నిర్వహించారు. అలాగే ఈషా ఇన్ఫ్రా కంపెనీ లో సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, పద్యమ్న ఉన్నట్లుగా గుర్తించారు. మోహిత్ రెడ్డి సుమారుగా రూ .600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని సిట్ అధికారులు గుర్తించారు. అలాగే చిత్తూరులో విజయానంద రెడ్డి కార్యాలయంలో కూడా సోదరుల నిర్వహించారు. అక్కడ మోహిత్ రెడ్డితో భాగస్వామి అయినట్టుగా సిట్ అధికారులు ఉన్నట్లుగా గుర్తించింది. ఇలాంటి సమయంలోనే సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో మరొక చార్జి సీటు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రెండు చార్జిషీట్లను అధికారులు దాఖలు చేశారు. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన ఈ రెండు చార్జి సీట్లలో అరెస్టు చేసిన నిందితులు రాజ్ కసి రెడ్డి, ధనుంజయ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చాణక్య, బాలాజీ గోవిందప్ప వంటి పాత్రలు ఉన్నాయని వివరించారు. కాని కొన్నిసార్లు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు నిందితుడిగా జగన్ పేరుని అధికారులు ఎక్కడ తెలుపలేదు. ఈ కేసు తుది దశకు చేరుకుందని సెప్టెంబర్ నెలలో విచారణ ముగిసే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి.
అసలు లిక్కర్ స్కామ్ పై జగన్ హస్తం ఉందా? అనే విషయం ఇప్పటివరకు తేల్చలేదు ? కానీ కూటమి అనుకూల మీడియాలో మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. టిడిపి అనుకూల మీడియాలో చెవిరెడ్డి కొడుకు వారు చేసే వ్యాపారాలన్నీ కూడా లిక్కర్ లో పెట్టుబడును పెట్టిన డబ్బుతోనే వచ్చాయని, అలాగే రాజ్ కసిరెడ్డి కూడా లిక్కర్ తోనే, ఎంపీ మిథున్ రెడ్డి కి కూడా లిక్కర్ డబ్బులతోనే చేశారని.. అసలు దొరికిన నిందితులందరికీ కూడా వాళ్ల వ్యాపారాలన్నీ లిక్కర్ స్కామ్ వల్లె నడుస్తున్నాయంటూ రాసుకున్నాయి. అంత వీరే తీసుకుంటే మరి జగన్ ఏం తిన్నట్టు అనే ప్రశ్న ఎప్పుడు మొదలయ్యింది?. ప్రభుత్వ మద్యం దుకాణాలలో అసలు తినడానికి ఏమీ ఉండదు.. ఇక సప్లై చేసే కంపెనీలలో తినాలి అంటే కేవలం 10%నుంచి 20%మాత్రమే వస్తుంది.. అరెస్ట్ అయిన వారంతా కూడా లిక్కర్ సంస్థలలో పెట్టుబడులు పెట్టి వారి తీసుకున్నారు..మరి దీంతో మాజీ సీఎం జగన్ కు ఏం సంబంధం ఉంది? ఒక్క రూపాయి అయినా జగన్ కు ముట్టింద అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది?