సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. పవన్ కళ్యాణ్ ఈ పార్టీని స్థాపించిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అయినా కూడా వెనుదిరగకుండా పోరాడుతూనే వచ్చాడు. 2014 వ సంవత్సరం ఎన్నికల్లో జనసేన పార్టీ స్థాపించబడి ఉన్నప్పటికీ పోటీ లో దిగలేదు. 2019 వ సంవత్సరం పోటీలో దిగిన ఈ పార్టీ కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2024 సంవత్సరంలో మాత్రం జనసేన పార్టీ తెలుగు దేశం , బీ జే పీ లతో పాటు పొత్తుగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని జనసేన సాధించుకుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి లో కొనసాగుతున్నాడు. ఇకపోతే చాలా కాలం క్రితమే జనసేన పార్టీ ఆఫీసును మొదలు పెట్టారు. కానీ ఇది అంత స్పీడ్ గా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు దీని పనులు చక చక జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ టివి మరియు జనసేన మధ్య ఒక సమస్య ఏర్పడింది. అది ప్రస్తుతం పెద్దది అయ్యేలా కనబడుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బిగ్ టీవీ వారు జనసేన పార్టీ కార్యాలయం పనులు జరుగుతున్నట్లు ఓ కథనాన్ని ప్రచురించినట్లు , ఆ కథనాన్ని ప్రచురించడంతో తమను ఎందుకు ఆ కథనాన్ని ప్రచురించారు టార్గెట్ చేస్తున్నట్లు , ఒక పార్టీ కార్యాలయం పనులు జరుగుతున్నాయి అనే కథనాన్ని ప్రచురించడం కూడా తప్ప , అందులో ఏ మాత్రం తప్పులేదు. ఆ వార్త ద్వారా ఎవరిని కించపరచలేదు.
అలాంటి సందర్భం లో ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారు అనే బిగ్ టివి వారు జనసేన వై ఫైర్ అవుతున్నారు. అలాగే ఎలాంటి తప్పుడు కథనాలు రాయకుండా ఉన్నది ఉన్నట్లుగా చూపించిన కూడా తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే దానిపై సమాచార హక్కు చట్టం మంత్రి అయినటువంటి పార్థ సారధి ని బిగ్ టీవీ సంస్థ వారు కలిసినట్లు తెలుస్తోంది. మరి జనసేన , బిగ్ టీవీ ఇష్యూ ఎంత దూరం వెళుతుందో చూడాలి.