తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆ మధ్యకాలంలో కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.. దీంతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఏంటి ఆ వివరాలు చూద్దాం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు పై దూకుడు పెంచింది.. ఈ కేసు విచారణ నడుస్తున్న సమయంలో మంత్రి కొండా సురేఖ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారం గురించి అలాగే సమంత విడాకుల వ్యవహారం లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందంటూ కొన్ని ఆరోపణలు చేసింది.. దీనిపై స్పందించినటువంటి నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు ఈ ఇష్యూ పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్టం దావాను బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరిగణలోకి తీసుకున్నారు. అలాగే కొండా సురేఖ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈనెల 21 నుంచి నిందితురాలికి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. దీనిపై మంత్రి కొండా సురేఖ తరఫున ఉన్నటువంటి న్యాయవాది అందించిన అభ్యంతరాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.. కొండా సురేఖ మాట్లాడిన మాటలు, ఊహాగానాల ఆధారంగా మాత్రమే ఉన్నాయని సరైన ఆధారాలు లేవని కోర్టు చెప్పింది..
దీనిపై లిఖితపూర్వకంగా రుజువు లేకపోవడంతో సురేఖ తరపు న్యాయవాది ఇచ్చిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. అంతేకాదు కొండా సురేఖ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ పోగుల చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు మంత్రిపై కేసు నమోదు చేయాలని తేల్చి చెప్పింది. దీంతో పోలీస్ స్టేషన్ లో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు అయింది.