రాజకీయాలకు గుడ్‌బై అన్నా.. పదవులకు రీ ఎంట్రీ ? చిరు చుట్టూ మళ్లీ హడావుడి..!
బీజేపీ వ్యూహంలో భాగంగా, దక్షిణ రాష్ట్రాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచడం లక్ష్యం. ఇందులో భాగంగా “కలివి కూటమి”గా మారిన టీడీపీ - జనసేన పార్టీలకు కొన్ని రాజ్యాంగ పదవులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన కోటాలో గవర్నర్ పదవికి ఎవరు ఉంటారన్న చర్చలో చిరంజీవి పేరు వినిపించడం ఆశ్చర్యకరం కాదు. జనసేనకి సంబంధం ఉండే ప్రముఖులలో చిరంజీవి పేరు ఇప్పటికీ భారీ ప్రాచుర్యం కలిగి ఉంది. ఆయనకు ఉన్న పాన్ ఇండియా గుర్తింపు, సామాజిక వర్గాల్లో క్రేజ్ బీజేపీకి ఉపయోగపడవచ్చన్నది ప్రధాన వ్యుహం. వాస్తవానికి చిరంజీవి ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నరు. త్వరలోనే “విశ్వంబర” సినిమాతో వస్తున్నారు.
పైగా ఆయన ఎన్నోసార్లు తాను రాజకీయాలకు దూరమేనని స్పష్టం చేశారు. అలాంటిది ఇప్పుడు ఆయన పేరుని ఇలా బలంగా లింక్ చేయడం వెనుక రాజకీయ లెక్కలే ఉన్నాయనిపిస్తోంది . ఈ ప్రచారం వాస్తవమే అయితే - బీజేపీ దక్షిణాది వ్యూహాని కి చిరంజీవి ఓ కీలక కార్డు ! ప్రచారం కేవలం ఊహగానమే అయితే – అది చిరంజీవి పేరు నుంచి వచ్చేక్రేజ్‌కి నిదర్శనం. కానీ నిజంగా కేంద్రం గవర్నర్ పోస్టులకు ఎంపిక చేస్తూ “పరిశీలనలో చిరు ఉన్నారు” అని ఒకరైన అధికారికంగా చెబితే - అది ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు అవుతుంది. చిరంజీవి రాజకీయాల నుంచి బయటపడ్డా, ఆయన పేరు మాత్రం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. ఇది మెగా బ్రాండ్‌కు ఉన్న విలువ. అయితే ఈసారి ఆయన రాజ్ భవన్‌కు వెళ్తారా లేదా.. అనేది తేలాల్సిన విషయమే!