వార్నీ..ఈ ట్రంప్ యుద్ధాలను ఆపుతోంది అందుకానే..? కన్నింగ్ తెలివికి ప్రపంచ దేశాలు షాక్..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో యుద్ధాలు ఎక్కువ అయిపోయాయి . ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి అనేది మనం వార్తల ద్వారా నిరంతరం తెలుసుకుంటూనే వస్తున్నాం . మరి ముఖ్యంగా ఇజ్రాయిల్ - ఇరాన్ వార్ అయితే భీకరంగా జరిగింది . అసలు ఏ దేశం ఉంటుందో..?? ఏ దేశం పోతుందో..?? అని తెలియనంత దారుణంగా దాడులు జరుపుకున్నారు . ఒక దేశం అటాక్ చేస్తే దానికి రివర్స్ అటాక్ మరొక దేశం మిస్సైల్స్ వదలడం తో భీకర యుద్ధ వాతావరణం కనిపించింది.  ఎట్టకేలకు 12 రోజులకు జరుగుతున్న బీకర్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
 

 నువ్వా - నేనా అంటూ పోటీపడి విధ్వంసానికి పాల్పడ్డా ఇరాన్ - ఇజ్రాయిల్ ఎట్టకేలకు శాంతించ్చాయి. ఫైనల్లీ ఇప్పుడు రెండు దేశాలు కాల్పుల విరమణ అమల్లోఖి తీసుకొచ్చాయి. అయితే ఏ దేశాలు యుద్ధం జరుపుకున్నా సరే అక్కడ కామన్ గా వినిపించే ఒకే ఒక్క పేరు డోనాల్డ్ ట్రంప్.  అమెరికా అధ్యక్షుడు . ఇండియా - పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతున్న మూమెంట్లో "నేనే నేనే ఆపాను అంటూ ట్విట్టర్ వేదిక తనకు తానే డబ్బు కొట్టుకున్న డోనాల్డ్ ట్రంప్".. ఇజ్రాయిల్ - ఇరాన్ వార్ మధ్య తలదూర్చి ఉన్న పొజిషన్ ఇంకా ఎంత దారుణంగా మార్చేసాడు అనేది అందరికీ తెలిసిందే .


ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఓకే అయిన క్రమంలోనే ఈ ట్రంప్  కీలకమైన నిర్ణయం తీసుకున్నారు . ఇరాన్ పై ఇప్పటివరకు విధించిన అన్ని వాణిజ్య ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాడు . ఇది నిజంగా షాకింగ్ అని చెప్పాలి . ఎందుకంటే ట్రంప్ నే ఇరాన్ పై  దాడులు జరిపించాడు. మరి అలాంటి ట్రంప్ ఏ ఇప్పుడు వాణిజ్య ఆంక్షలు అన్ని ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవడం అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . అయితే దీని వెనక భారీ బిజినెస్ మైండ్ ఉంది అంటున్నారు నిపుణులు . అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం టోటల్ శాంతి పడిన మూమెంట్లో డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు . ఇరాన్ పై ఇప్పటివరకు ఆయన ప్రభుత్వం విధించిన వాణిజ్య ఆంక్షలను ఎత్తివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు . ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు . "ఇక ఇరాన్ నుంచి చైన చమురు కొనుగోలు చేసుకోవచ్చు.. అలాగే అమెరికా నుంచి కూడా అలా కొనుగోలు చేస్తాయి అని ఆశిస్తున్న.. ఇది నా వల్లే జరిగింది అంటూ ట్రంప్ క్లియర్ గా రాసుకోచ్చారు".


అయితే ట్రంప్ యుద్ధం ఆపడానికి తన అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికే  అంటూ ఇది బిజినెస్ ట్రిక్ అంటూ నిపుణులు మాట్లాడుతున్నారు.  ఇరాన్ నుంచి అధికంగా చమురు  దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ప్రథమంగా చైనా ఉంది.  2025లో 13.6% చమురును ఇరాన్ నుంచే కొనుగోలు చేసిన్నట్లు  పెద్దలు చెబుతున్నారు.  అయితే యుద్ధం కారణంగా విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడంతో ఒక్కసారిగా జనాలు షాక్ అయ్యారు. ఇది అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తన దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి చేస్తున్నాడు అని .. ట్రంప్ పూర్తిగా బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తున్నాడు అని ఘాటుఘ్టుగా కొంతమంది జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: