క‌ల్వ‌కుంట్ల క‌విత కొత్త పార్టీపై హింట్ ఇచ్చిందెవ‌రు...?

RAMAKRISHNA S.S.
- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. తండ్రి కేసిఆర్ కు రాసిన లేక లీక్ అయిన గంటలు వ్య‌వ‌ధి లోనే పరిణామాలు చకచగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ లో జరుగుతున్న తప్పుల పై తండ్రికి లేఖ ద్వారా తెలియజేసిన కవిత ఆ లేఖ కాస్త లీకవ్వడంతో ప్రత్యతి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీలో విభేదాలు బయట పెట్టుకున్నట్టు అయింది. క‌విత‌కు కేటీఆర్ - హరీష్ రావు లతో గ్యాప్ వచ్చిందని అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది. ఇదిలా ఉంటే త్వరలోనే కవిత బీ ఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పి కొత్త పార్టీ పెడతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన కవితకు చాలామంది వచ్చి స్వాగతం పలికారు.


ఎయిర్పోర్ట్ వద్ద ఒక్క బీఆర్ఎస్ జెండా కూడా కనిపించలేదు. కవితకు స్వాగతం పలికే అభిమానులలో గులాబీ కండువా ధరించిన నాయకులు .. కార్యకర్తలు కనుచూపు మేరలో కూడా లేరు. టీం కవితక్క అనే ఫ్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కనిపించారు. బీసీ ఆత్మబంధువు మా కవితక్క అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. సామాజిక తెలంగాణ అంటూ భారీ ఫ్లెక్సీ పట్టుకుని కవితకు స్వాగతం పలికారు. ఏది ఏమైనా కవిత కొత్త పార్టీ పెడితే ఇప్పటికే అధ్యక్షురాలుగా ఉన్న తెలంగాణ జాగృతి పేరుని పార్టీ పేరుగా మార్చేస్తారా ? లేక సామాజిక న్యాయం అంటూ పదేపదే వ్యాఖ్య‌లు చేస్తున్న నేపథ్యంలో సామాజిక న్యాయం కోసమే పుట్టిన పార్టీలా మరో కొత్త పేరుని తెర‌మీద కు తెస్తారా ?అన్నది చూడాలి.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: