13 ఏళ్ల విద్యార్థితో వెళ్లిపోయిన 23 ఏళ్ల టీచర్.. ఐదు నెలల గర్భవతిగా దొరికింది..?

praveen
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు చాలా పెడదారులు పడుతూ షాక్ లు ఇస్తున్నారు. వెస్ట్రన్ కంట్రీస్ లో లాగా పిల్లలతో లైంగిక కార్యకలాపాలకు తేరలేపుతూ అందరి చేత ఛీ కొట్టించుకుంటున్నారు. సూరత్ లో జరిగిన ఒక దారుణ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. 23 ఏళ్ల మహిళా ప్రైవేట్ ట్యూటర్ తన వద్ద చదువుకుంటున్న 13 ఏళ్ల మైనర్ విద్యార్థినిని ఎత్తుకెళ్లింది. ఐదు నెలల తర్వాత ఆ టీచర్ ఐదు నెలల గర్భవతిగా దొరకడంతో ఈ కేసు మరింత షాకింగ్‌గా మారింది.

అసలు విషయం ఏమిటంటే, ఆ గర్భానికి కారణం ఆ 13 ఏళ్ల మైనర్ బాలుడేనని పట్టుబడ్డ టీచర్ ఆరోపిస్తోంది. దీంతో షాకైన అధికారులు తక్షణమే డీఎన్ఏ పరీక్షకు ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారం ఏప్రిల్ 25 మధ్యాహ్నం మొదలైంది. గతంలో బాలుడి కుటుంబానికి బాగా నమ్మకస్తురాలిగా ఉన్న ఆ టీచర్, పట్టపగలే ఆ చిన్నారిని తీసుకెళ్లి అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారి రెసిడెన్షియల్ సొసైటీలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, భుజంపై స్లింగ్ బ్యాగ్ వేసుకుని ఆ టీచర్ బాలుడితో కలిసి బయటకు వెళ్తున్న దృశ్యం రికార్డైంది. ఇది ఆమె ముందస్తు ప్రణాళికతోనే ఈ పని చేసినట్లు స్పష్టం చేస్తోంది.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. గత మూడేళ్లుగా ఆ బాలుడికి ట్యూషన్ చెబుతున్న ఈమెకు, గత ఏడాదిగా అతడే ఏకైక ప్రైవేట్ విద్యార్థిగా ఉన్నాడు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం ప్రమాదకరంగా మారింది. లైంగిక వేధింపులు మొదట ఆ ట్యూటర్ నివాసంలో, ఆ తర్వాత వారు పారిపోతున్నప్పుడు గుజరాత్‌లోని వడోదరలోని ఓ హోటల్‌లో జరిగినట్లు వెల్లడైంది.

పారిపోవడానికి ముందు, 13 ఏళ్ల బాలుడు తన దుస్తులు కొన్ని ఆ టీచర్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె వారి అవసరాల కోసం మరికొన్ని వస్తువులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన అనధికారిక బోధనా వాతావరణంలో పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: