ప్లీజ్ ఆదుకోండ‌య్యా.. అప్పు కోసం పాక్ ఆప‌శోపాలు!

RAMAKRISHNA S.S.
ఆప‌రేష‌న్ సింధూర్ తో భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధ వాతావరణం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్న పాక్‌.. ఉగ్రవాదాన్ని ఉసిగొల్ప‌డ‌మే కాకుండా యుద్ధానికి సై అంటూ భార‌త్ ను రెచ్చ‌గొట్టింది. చివ‌ర‌కు భార‌త్ చేతుల్లో చావు దెబ్బలు తింటోంది. ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నా.. భారత త్రివిధ దళాలు ప్రతి ప్రయత్నాన్ని సమర్ధవంతంగా అడ్డుకుంటూ బుద్ధి చెబుతున్నాయి. రాత్రి జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన రెండు జెఎఫ్‌-17, ఒక ఎఫ్‌-16 యుద్ధ విమానాలను భార‌త్‌ కూల్చివేసింది.


అలాగే పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన AWACS విమానాన్ని ధ్వంసం చేసింది. మ‌రోవైపు కరాచీ పోర్టుపై మిస్సైల్స్‌తో దాడి చేసి.. పెద్ద మొత్తంలో పోర్టుని డ్యామేజ్ చేసింది. యుద్ధంలోనూ భారత్ ను పాకిస్తాన్ ఏమాత్రం ఎదుర్కోలేక‌పోయింది. దానికి తోడు ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత దారుణంగా దిగ‌జారిపోవ‌డంతో పాక్ అల్లాడిపోతుంది. గోధుమ పిండి కోసం కూడా కట్టుకున్న ఘటనలు ఇప్ప‌టికే వెలుగు చూశాయి.


ఈ క్ర‌మంలోనే అప్పు ఇచ్చి ఆదుకోండ‌య్యా అంటూ మిత్రదేశాల‌ను పాక్ అడుక్కోవ‌డం ప్రారంభించింది. భార‌త్ దాడుల వల్ల భారీ నష్టాలు వాటిల్లాయని, స్టాక్ మార్కెట్లు ప‌త‌నం అయ్యాయ‌ని.. ద‌య‌జేసి ర‌ణాలు ఇచ్చి త‌మ‌ను ఆదుకోవాల‌ని పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ భాగస్వాములను అభ్యర్థించింది. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టింది. పెరుగుతున్న యుద్ధ వాతావరణం, కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్ మధ్య ప్రపంచ బ్యాంకుతో సహా అంతర్జాతీయ భాగస్వాముల నుండి అప్పు పొందేందుకు పాక్ ఆప‌శోపాలు ప‌డుతోంది. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పాకిస్తాన్‌కు రుణాలు ఇవ్వడం అంటే ప్రపంచ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. ఇదే విష‌యాన్ని నేడు ఆర్థిక సంక్షోభం నుండి పాకిస్తాన్‌ను కాపాడటానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఏర్పాటు చేయ‌నున్న స‌మావేశంలో భార‌త్ వివ‌రించ‌బోతుంది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: