సింధూర్ : పాక్ కి అసలు సహాయం చేయొద్దు.. ఆ సంస్థకు భారత్ సూచన..?

Pulgam Srinivas
గత రెండు రోజులుగా భారత్ - పాక్ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ కి సంబంధించిన తీవ్ర వాదులు భారతదేశానికి సంబంధించిన కొంత మంది వ్యక్తులపై దాడి చేసి అందులో చాలా మంది ప్రాణాలను తీశారు. అలా భారతదేశానికి సంబంధించిన అనేక మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నందుకు గాను భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులపై గట్టి ఎత్తున చర్యలు తీసుకోవాలి అని డిసైడ్ అయింది. దానితో రెండు రోజుల క్రితం అర్ధ రాత్రి సడన్ గా పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాద స్థాపరాలపై దాడి మొదలు పెట్టింది.


ఇక ఉగ్రవాదులు తేరుకునే లోపే పాకిస్తాన్ కి సంబంధించిన అనేక ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఎంతో మంది ఉగ్రవాదులను భారత ఆర్మీ చంపేసింది. ఇకపోతే భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ కూడా భారత్ పైకి దాడి చేసింది. కానీ భారత ఆర్మీ , పాకిస్తాన్ దాడిని చాకచక్యంగా ఎదుర్కొంది. ఇప్పటికి కూడా భారత్ వ్యూహాత్మక దాడికి పాకిస్థాన్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. దానితో పాకిస్తాన్ తేరుకోలేక పోతుంది. ఇలాపోతే తాజాగా పాకిస్థాన్ కి ఆర్థిక సహాయం చేయొద్దు అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ ను భారత్ కోరింది. అసలు విషయం లోకి వెళితే ... ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ కి సహాయం చేయడం ప్రమాదకరమని సూచించింది.


అతనపు రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్య నీధి (IMF) సంస్థ ను పాక్ ఆశ్రయించగా నేడు జరుగుతున్న కార్యనిర్వాహన బోర్డ్ సమావేశంలో దీనిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ నిర్ణయం తీసుకోనుంది. ఈ భేటీలో పాక్ సహాయం పై భారత ప్రతినిధి అభ్యంతరం తెలపనున్నారు. మరి పాకిస్థాన్ కి ఆర్థిక సహాయం చేసే విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: