S-400 ముందు పాకిస్తాన్ ఆయుధాలు మటాష్ ?

Veldandi Saikiran

 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆపరేషన్ సింధూర పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడులు చేసి ఏకంగా 100 మందిని చంపేసింది ఇండియన్ ఆర్మీ. అయితే పాకిస్తాన్ పై యుద్ధం నేపథ్యంలో s400  ఆయుధ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోంది. పాకిస్తాన్ ను చిత్తు చేసేందుకు ఈ వ్యవస్థను... ఇండియన్ ఆర్మీ వాడుకుంటుంది.

 శత్రుదేశం నుంచి వస్తున్న యుద్ధ విమానాలు అలాగే క్షిపణులు, డ్రోన్లను మార్గమధ్యమంలోనే.. ఈ s400 పేల్చివేస్తుంది.  అందుకే పాకిస్తాన్ పైన ఇండియా పై చేయి సాధిస్తుందని చెబుతున్నారు. అసలు ఈ S 400  ఆయుధాలు ఏంటి అనేవి ఒకసారి పరిశీలిస్తే... ఇది సంచార క్షిపణి వ్యవస్థ అని చెబుతారు. రష్యా కు సంబంధించిన ఎన్ పి ఓ అల్మజ్ సంస్థ దీని తయారు చేసింది. గతంలో ఎస్ 300 ఉండేది. దాన్ని అప్గ్రేడ్ చేసి.. ఎస్ 400 ను రూపొందించారు.

 ఇది ప్రత్యర్థి జామింగ్ విధానాలను ఎదుర్కొంటుంది. యుద్ధ విమానాలు అలాగే డ్రోన్లను... కచ్చితంగా కుప్ప కూల్చేస్తుంది.  ఇక మొత్తంగా ఐదు క్షిపని వ్యవస్థల కొనుగోలుకు ఇండియా ఏకంగా 543 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం 2018 లో రష్యాతో జరిగింది. ఇందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే ఇండియాకు చేరగా మిగతావి ఆగస్టులో వస్తాయి.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: