ఏపీ 2029: నారా లోకేష్ పై పోటీ .. వైసీపీ ప్రత్యర్థి లేరా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తాయంటే అందరి చూపు అటు మంగళగిరి, పిఠాపురం, కుప్పం, పులివెందల ఇతరత్ర ప్రాంతాల మీద చూపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికలలో మంగళగిరికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుందట.. ఎందుకంటే ఈసారి రాబోయే ఎన్నికలలో లోకేష్ ప్రత్యర్థి ఎవరు అనే విషయం పైన చర్చ జరుగుతూ ఉన్నది. 2019 నుంచి మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ ప్రత్యేక ప్రాధాన్యత వ్యవహరిస్తూ ఉన్నారు. 2019లో ఓడిపోవడం జరిగింది . అయినా కూడా పట్టు వదలకుండా 2024లో భారీ మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ అప్పటినుంచి తన నియోజవర్గం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు.


దీంతో వైసిపి పార్టీ నుంచి మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు ఎవరు అనేది ఇప్పుడు సందేహంగా మారిందట. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ రోజురోజుకీ పేరు ఎక్కువగా వినిపిస్తోందని నియోజకవర్గంలో సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా రాజధాని అమరావతి పనులను కూడా ప్రభుత్వం వేగవంతంగానే చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. మూడేళ్లలోన రాజధాని పనులను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం ఆశిస్తుంది. అలాగే మంగళగిరిలోని భూముల రేట్లు కూడా పెరిగాయి. ఇంటి అద్దెలు కూడా గతంలో కంటే చాలా రెట్టింపుగా మారాయట.


ఇక మరొకవైపు మంగళగిరిలో వైసిపి రాజకీయంగా ఇబ్బంది పడుతోందనే విధంగా వినిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు గత కొన్ని నెలలుగా యాక్టివ్గా లేరట.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్లీ తిరిగి వైసీపీలోకి చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. వచ్చే ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన మక్కువ చూప లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు నియోజకవర్గంలో షిఫ్ట్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. గతంలో వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో చేరి పదవులు తీసుకున్న వారు కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నారట. ఒకవేళ ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి సీటు వద్దనుకుంటే ఎవరికి ఇవ్వాలన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి నారా లోకేష్ ని తట్టుకోని నిలబడే వైసిపి ప్రత్యర్థి ఎవరా అన్నది చూడాలి.?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: