లేడీ మంత్రికే అసభ్యకరమైన మెసేజ్ లు పంపిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే..?

Divya
సోషల్ మీడియా లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని వివాదాలను సృష్టించడం వల్ల అలాగే పెద్ద పెద్ద సిని సేలబ్రిటీలను టార్గెట్ చేస్తూ రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ పేరు సంపాదిస్తున్నారు. అలా ఇప్పుడు తాజాగా ఒక మహిళ మంత్రి పైన పాతికేళ్ల కుర్రాడు రోజు పిచ్చిపిచ్చి మెసేజ్ లతో పాటు వీడియో కాల్స్ వంటివి చేస్తూ ఉన్నారట. అలాగే అసభ్యకరమైన మెసేజ్లను కూడా పెడుతూ చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారట మహిళామంత్రికి. మరి అందుకు సంబంధించి పూర్తి విషయాలు చూద్దాం.


ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఒక పాతికేళ్ల కుర్రాడు బిజెపి నేత పంకజా ముండే కు సైతం ఇలా వేధింపులతో గురి చేస్తున్నారట. ఈ విషయం పైన ముంబై పోలీసులు యువకుని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తనకు పంపించిన కొన్ని అసభ్యకరమైన మెసేజ్లు పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లడంతో ముంబై సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేయడంతో పూణేకి చెందిన అమోల్ కాలే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.


బిజెపి సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఈ యువకుడిని అరెస్టు చేసి కోర్టులో కూడా ప్రవేశపెట్టారు.కోర్టు రెండు రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉంచాలని తెలియజేశారు. అయితే అమోల్ వెనక ఎవరైనా హస్తము ఉందా? లేకపోతే స్వయంగా మంత్రికి మెసేజ్ పెట్టారా లేక అనే విషయం పైన పోలీసులు విచారణ చేస్తున్నారట.. అమోల్ మెసేజ్ లు కాల్స్ మంత్రి పంకజా డిప్రెషన్ లోకి వెళ్లేలా చేశాయట.. ముఖ్యంగా మహిళా మంత్రికే.. ముద్దు ఇస్తావా? హగ్గు ఇస్తావా..? నువ్వంటే చాలా ఇష్టం అంటూ మెసేజ్లు పెట్టినట్లు  అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఆ నిందితుడిని సహితం పలు రకాల శిక్ష ఆధారంగా శిక్షిస్తామంటూ అధికారులు తెలియజేశారు.మరొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకుంటామంటూ తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: