వందేళ్ల విజ‌న్ .. బాబు ఇది చూడ‌రా... గంటా శ్రీనివాస‌రావు ట్వీట్ వైర‌ల్‌...!

frame వందేళ్ల విజ‌న్ .. బాబు ఇది చూడ‌రా... గంటా శ్రీనివాస‌రావు ట్వీట్ వైర‌ల్‌...!

RAMAKRISHNA S.S.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ నేతలు ఒకే మాట ఎప్పుడూ చెపుతూ ఉంటారు. త‌మ నాయ‌కుడికి ఉన్న విజ‌న్ ఎవ్వ‌రికి లేద‌ని వారు అంటూ ఉంటారు. ఇక వ‌చ్చే వందేళ్ల గురించే చంద్ర‌బాబు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటార‌ని కూడా వారు అంటూ ఉంటారు. అంత వ‌ర‌కు ఓకే .. వ‌చ్చే 50 - 100 ఏళ్ల గురించి ఆలోచ‌న చేయ‌డం త‌ప్పు కాదు .. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి క‌దా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మంగళవారం చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో బాగా దుమారం రేపుతోంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది అనే చ‌ర్చ‌లు కూడా వినిపిస్తున్నాయి . తన ట్వీటును గంటా శ్రీనివాస రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంది రామ్ మోహన్ నాయుడుకు కూడా ట్యాగ్ చేయ‌డం విశేషం గానే చెప్పుకోవాలి.


గంటా చేసిన ట్వీట్ సారాంసం ఇలా ఉంది...
ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ :
‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం అని.. తాను ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చినా విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింద‌ని వాపోయారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరార‌ని గంటా తెలిపారు. విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింద‌ని ... దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.’ అంటూ గంటా త‌న సారాంశంలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: