పైసా కొట్టు పర్మిషన్ పట్టు!

frame పైసా కొట్టు పర్మిషన్ పట్టు!

Pandrala Sravanthi
భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే కరప్షన్ అనేది తప్పనిసరిగా నడుస్తుంది. ఏ పని కావాలన్నా అధికారుల నుంచి మొదలు రాజకీయ నాయకుల వరకు డబ్బులు తీసుకుంటారు. పైసా ఇవ్వందే ఫైల్ ముందుకు కదలదు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ కూడా కొంతమంది అధికారుల వల్ల  ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కొన్ని వార్తాపత్రికలు కథనాలు రాసుకుంటూ వస్తున్నాయి. తాజాగా రెండు బడా పత్రికలు రాసిన కథనాల ప్రకారం.. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ లో పంచాయతీల్లో ఇంటి నిర్మాణం కావాలన్నా, నల్లా కలెక్షన్స్ ఇలా ఏ పనిలో అయినా కరప్షన్ పెరిగిపోయిందట. ఏ నిర్మాణం చేపట్టాలన్న ఆయా గ్రామపంచాయతీలో కొంత అమౌంట్ ఫిక్స్ చేసి అధికారులు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని ఒక టాక్ వినిపిస్తోంది. మరి అధికారులు చేసే పని అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండానే నడుస్తుందా అనేది ఒక ప్రశ్న..


 సాధారణంగా ప్రజాప్రతినిధుల కిందనే అధికారులు పనిచేస్తూ ఉంటారు, వారు చెప్పందే ఏ అమౌంట్ అయినా ఫిక్స్ చేయరు. అధికారులు సొంతంగా నిర్ణయాలు తీసుకొని అమౌంట్ ఫిక్స్ చేసే అధికారం వారికి అస్సలు ఉండదు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ కనసన్నాల్లోనే ఇదంతా నడుస్తోందని రాజకీయ మేధావులు అంటున్నారు. అంతేకాకుండా చాలామంది ఓఎస్డీలు ప్రజల నుంచి డబ్బులు దోచేస్తున్నారని వార్త కథనాలు వస్తున్నాయి. ఈ విషయం అసలు మంత్రులకే తెలియదని అంటున్నారు. అంటే ఇందులో మంత్రులకు తెలియకుండానే ఓఎస్డీలు దోచేస్తారా.?


ఈ కథనాల ప్రకారం అధికారులు మాత్రమే తప్పు చేస్తున్నారు, పైనున్న రాజకీయ నాయకులు, చంద్రబాబు ప్రభుత్వం అసలు తప్పు చేయడం లేదని వార్త కథనాలు రాస్తున్నారు. మరి తప్పు లేనప్పుడు కిందిస్థాయి అధికారులు తప్పు చేస్తే ఎందుకు మందలించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ఏ పని కావాలన్నా పైసా కొట్టు పని చేపట్టు అనే విధంగా తయారయింది. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం స్పందించి కంట్రోల్ చేయకుంటే మాత్రం  రాబోవు రోజుల్లో ప్రభుత్వం చెడ్డ పేరు మూటకట్టే అవకాశం ఉందని రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: