
సీఎం రేవంత్ కి తృటిలో తప్పిన ప్రమాదం ?
ఆ హోటల్లోని లిఫ్టులో కేవలం 8 మంది ఎక్కాల్సి ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ నేపథ్యంలో ఏకంగా 13 మంది లిఫ్టు ఎక్కినట్లు చెబుతున్నారు. 13 మంది లిఫ్టులో ఎక్కడంతో... అందులో టెక్నికల్ సమస్య నెలకొంది. దీంతో లిఫ్టు ఒకసారిగా ఆగిపోయింది. కాసేపు అందులో ఉన్న వారందరికీ ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు... లిఫ్ట్ ను బాగు చేసే పనిలో పడ్డారు.
మొదట సీఎం రేవంత్ రెడ్డి ని బయటకు తీసిన తర్వాత... అధికారులను బయటకు తరలించారు. మరో లిఫ్టులో రేవంత్ రెడ్డిని ఎక్కించి... ప్రమాదం నుంచి పడేశారు అధికారులు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో... అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.
ఇది ఇలా ఉండగా... ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీ లతో... కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా... ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో అందరూ అద్దంకి దయాకర్ లాగా ఓపికగా ఉండాలని కోరారు. ఆయన ఓపికతో ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడని తెలిపారు. తన జీవితంలో 10% ఏఐసీసీకి అలాగే 15% పిసిసికి ఇస్తున్నాడని కొనియాడారు.