ఈవీఎంలలో లాజిక్ మిస్సయిన వైసీపీ.. ఎలా అంటే..?

frame ఈవీఎంలలో లాజిక్ మిస్సయిన వైసీపీ.. ఎలా అంటే..?

Divya
తులసి గబాల్.. అమెరికన్ ఇంటలిజెన్స్ చీఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెచ్చిపోతూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని.. చంద్రబాబు అలా ఈవీఎంలను హ్యాక్ చేసే అధికారంలోకి వచ్చాడని, నరేంద్ర మోడీ కూడా అలాగే ఈవీఎంలను హ్యాక్ చేసి అధికారంలోకి వస్తున్నాడని, ఇలా పలు రకాల స్టేట్మెంట్లను ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. మరి అదే ఈవీఎంలు జగన్మోహన్ రెడ్డికి 2014లో 67 సీట్లు ఎందుకు ఇచ్చాయి. అదే ఈవీఎంలు మన 2019లో ఏకంగా 151 సీట్లు ఎలా ఇచ్చాయి.

 2019లో జగన్ ను  అనుకూలంగా ఈవీఎం మెషిన్లను హ్యాకింగ్ చేశారా?  లేదా 2014లో ప్రతిపక్ష స్థానం ఆయనకి ఇద్దాంలే అని హ్యాకింగ్ చేశారా.. అలా ఆయనపై కాస్త జాలి చూపించారా..?  ఇప్పుడు వచ్చిన 11 సీట్లు అక్కడ కూడా చూపించొచ్చు కదా.. 2014లోనే చూపించింటే పార్టీ కూడా అప్పటికే ముగిసిపోయేది కదా. అదేదో అంటారు కదా మొగ్గలోనే తుంచి అవతల పడేయొచ్చు కదా.. మరి ఎందుకు చేయలేదు.. అంతకుముందు జరిగిన ఉప ఎన్నికలు కూడా ఈవీఎంలతోనే కదా వైసిపి గెలిచింది.  అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా.. ఈ కాంగ్రెస్ పార్టీనే కదా  జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించింది. అలాగే కడపలో పోటీ చేసినప్పుడు.. ఐదు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు కదా.. అప్పుడు కేంద్రంలోనూ,  రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఏ కదా అధికారంలో ఉన్నది.  ఆ సమయంలో విజయమ్మ పులివెందులలో గెలిచారు కదా.. అప్పుడు పోనీలే మన జగనే కదా అని వదిలేసారా.. లేదు కదా ఆయనపై పగ సాధింపులు చేపట్టి జైలు కూడా పంపించారు కదా..

 కాబట్టి ఇలాంటివన్నీ మానేసి ఇకపై ఈవీఎంల మీద పడి ఏడ్చకుండా.. ముందు అసలు ప్రజల మనసు ఎలా గెలుచుకోవాలో ఆలోచిస్తే బెటర్ అని ప్రముఖ జర్నలిస్ట్ సాయి తన అభిప్రాయంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: