
ఏపీ: పిఠాపురంలో భారీ ట్విస్ట్..టిడిపి కార్యకర్తలపైనే కేసులా..?
గడిచిన రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం కి వెళ్లి అక్కడ పలు రకాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. అయితే అక్కడ ఎలాంటి పని చేసిన టిడిపి నియోజకవర్గం ఇన్చార్జి అయినటువంటి వర్మను మాత్రం ఎటువంటి కార్యక్రమాలకు ఆహ్వానించలేదు. దీంతో అక్కడ టిడిపి నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా రగిలిపోయి మరి నాగబాబు పర్యటనను సైతం ఎన్నో విధాలుగా అడ్డుకున్నారు. అటు టిడిపి, జనసేన మధ్య చిన్నపాటి ఘర్షణలు కూడా మొదలయ్యాయని వార్తలు కూడా వినిపించాయి.
అలాంటి సమయంలోనే తనను అడ్డుకొని మోటార్ బైక్ ని సైతం ధ్వంసం చేశారు అంటూ జనసేనకు సంబంధించి నాగబాబు టిడిపి కార్యకర్తలు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీళ్ళ పైన పోలీస్ కేసు నమోదు చేయడంతో అటు టిడిపి కార్యకర్తలు సైతం రగిలిపోతున్నారు. ఇక అదే సందర్భంలో అక్కడ ఏఎస్ఐ జానీ భాష కూడా టిడిపి కార్యకర్తల పైన ఫిర్యాదు నమోదు చేశారట. దీంతో అటు అధికారంలో ఉన్నటువంటి పార్టీపైనే రెండు వేరు వేరు ఫిర్యాదుల మేరకు టిడిపి కార్యకర్తల పైన పలు రకాల కేసులు నమోదు కావడంతో ఇప్పుడు ఏపీలో ఇది పెద్ద ట్విస్ట్ గా మారుతున్నది. మరి వీటి పైన వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.