
మయన్మార్ లో 10 వేల మంది మృతి ?
మయన్మార్ దేశంలో 10,000 మంది మరణించారట. రెండు రోజుల కిందట మయన్మార్ దేశంలో... భారీ భూకంపం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం నేపథ్యంలో... మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 1700 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రభుత్వం లెక్కలను జాతీయ మీడియా ప్రకటించింది. 3400 మంది ఈ భూకంపం కారణంగా గాయపడినట్లు తేల్చింది జాతీయం మీడియా.
అయితే సహాయక చర్యలు ముగిసేసరికి... మయన్మార్ దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా మరణాలు ఉండవచ్చని.... తాజాగా యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే... ముందే సంచలన ప్రకటన చేసింది. మయన్మార్ దేశంలో 15 లక్షల మందిపై ఈ ప్రకృతి విలయం ప్రభావం స్పష్టంగా ఉందని... వెల్లడించింది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే. రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో... భూకంపం రావడం ఇదే తొలిసారి అని కూడా చెబుతున్నారు.
ఇంత పెద్ద ఎత్తులో... భూకంపం వస్తే పదివేల మంది కచ్చితంగా మరణించే ఉంటారని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం మయన్మార్ దేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్దపెద్ద రెస్టారెంట్లలో.. వైఫ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ లో ఉంటాయి.. ఈ భూకంప దాటికి ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న జనాలు కూడా.. గజగజ వనిగిపోయారు. అందులో ఉన్న నీళ్లు కూడా కిందికి జలపాతంలా జారాయి. ఇలాంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.