ఆ డీఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తాను.. ఆ నిందితునికి హామీ ఇచ్చిన వైఎస్ జగన్!?

frame ఆ డీఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తాను.. ఆ నిందితునికి హామీ ఇచ్చిన వైఎస్ జగన్!?

Reddy P Rajasekhar
మాజీ సీఎం వైఎస్ జగన్ తీరు రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయినా ఏ మాత్రం మారలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తానని అంతవరకు ధైర్యంగా ఉండాలని నిందితుడు పవన్ కుమార్ కు జగన్ అభయం ఇచ్చారని తెలుస్తోంది.
 
వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త అయిన పవన్ కుమార్ ను జగన్ సోమవారం రోజున కలవడం జరిగింది. సునీల్ యాదవ్ ఫిర్యాదు కేసులో పోలీసులు పవన్ కుమార్ ను అరెస్ట్ చేయగా పులివెందులలో జగన్ పవన్ కుమార్ ను కలవడంతో పాటు భరోసా ఇవ్వడం గమనార్హం. సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం పులివెందుల పోలీసులు పవన్ కుమార్ పై కేసు నమోదు చేయడం జరిగింది.
 
వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ కు పవన్ కుమార్ అడ్మిన్ గా ఉన్నారు. డీఎస్పీ, సీఐ తనను కొట్టారంటూ పవన్ కుమార్ జగన్ కు చెప్పడం గమనార్హం. జగన్ ఇలా ఇచ్చిన హామీ గురించి సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.
 
రాష్ట్రంలో పార్టీ పుంజుకునే దిశగా జగన్ అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుంటే మాత్రం భవిష్యత్తులొ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమయ్యే పరిస్థితి లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కు షర్మిల సపోర్ట్ దక్కితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. జగన్ సరికొత్త హామీలతో కెరీర్ పరంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఇతర నేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: