
ఏపీ: చంద్రబాబు సర్కార్ కి.. అనుకూల మీడియా షాక్..!
ఓపెన్ రీచ్ లో సొంత సామ్రాజ్యాలు రోజుకి 15 లక్షలు మామూలతో పాటు, దందా డిపాజిట్ల తోపాటు బోటుకు లెక్క చొప్పున కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తూ, బెల్టు షాపులు చోటానేతలే చెలరేగిపోతున్నారట. వీటితోపాటుగా ఎస్సీ భూముల్ని కూడా వదలకుండా కూటమినేతలు చెలరేగిపోతూ ఆక్రమణ చేస్తూ ఉన్నారట. అయితే ఇది ఒక్కొక్కవారం ఒక్క జిల్లా గురించి రాసుకుంటూ ఉన్నారు.. అంటే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి దోపిడీ జరుగుతూనే ఉందని.. బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారు, ఇసుక అంతా కూడా ఎవరికీ ఇష్టం వచ్చినట్టుగా వారు అమ్మేసుకుంటున్నారు.
ఎవడికి ఫ్రీగా రావట్లేదు.. మద్యం బెల్టు షాపులను కూడా అడ్డదిడ్డంగానే అమ్ముకుంటున్నారని.. ఇళ్ల మధ్యలోకి ఏకంగా బెల్ట్ షాపులే వచ్చేసాయని చాలామంది గ్రామాలలోని ప్రజలు కూడా వాపోతున్నారు. అయితే ఇదివరకు బెల్ట్ షాపులు ఇలా ఉన్నాయా ఇదివరకు ఇలా ఇసుక అడ్డతీతంగా అమ్ముడు కోవడానికి కుదిరిందా.. అనేటట్టుగా వార్తలు రాసుకొచ్చారు అయితే ఇదంతా కూడా సీఎం చంద్రబాబుకి సపోర్టుగా ఉన్నటువంటి ఒక ప్రముఖ ఛానల్, వార్తాపత్రికలలోని ఇలాంటి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మొత్తానికి చంద్రబాబు సర్కారికి తన అనుకూల మీడియాని షాక్ ఇచ్చినట్లుగా పలువురు నేతలతో పాటు కార్యకర్తలు కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇకనైనా చంద్రబాబు వీటన్నిటిని గుర్తించి సరిచేసుకుంటారేమో చూడాలి.