దొంగల్లా మారిన వైసిపి ఎమ్మెల్యేలు .. జగన్ పై స్పీకర్ అయ్యన్న షాకింగ్ కామెంట్స్..!

frame దొంగల్లా మారిన వైసిపి ఎమ్మెల్యేలు .. జగన్ పై స్పీకర్ అయ్యన్న షాకింగ్ కామెంట్స్..!

Amruth kumar

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు ఊహించని పరిణామం చోటుచేసుకుంది .. గత కొంతకాలంగా అసెంబ్లీని బహిష్కరించిన విపక్ష వైసిపి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ ప్రశ్నలు రాతపూర్వకంగా అందించి సభకు రాకుండా వెళ్ళిపోతున్నారు .. అయితే దీనిపై గత కొంతకాలంగా అసెంబ్లీలో చర్చ జరుగుతూనే ఉంది .. అయితే ఈరోజు దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా స్పందించారు .. ఈ క్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు  చేయడం కొంత హాట్ టాపిక్ గా మారాయి .

అసెంబ్లీకి దొంగ చాటుగా వచ్చి వెళ్ళిపోతున్న వైసిపి ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ దొంగలు అన్న పదం వాడారు .. అయితే ఇప్పుడు దీనిపై గట్టి దుమారం రేగుతుంది .. అసెంబ్లీకి రెగ్యులర్గా రావాల్సిన వైసిపి ఎమ్మెల్యేలు రహస్యంగా దొంగల లాగా వచ్చి బయట నుంచి వెళ్ళిపోతున్నారని స్పీకర్ వ్యాఖ్యానించారు . ప్రశ్నలు అడిగే సభ్యులు సభలో లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నట్లు కూడా చెబుతున్నారు .. సభ్యులు సభకు రావాల్సిందేనని స్పీకర్ తెలిపారు .. గవర్నర్ ప్రసంగం తర్వాత వేరువేరు రోజుల్లో వీరు సంతకాలు పెట్టి బయట నుంచే వెళ్ళిపోతున్నట్టు అసెంబ్లీ సిబ్బంది గుర్తించారు .
 
వైసిపి ఎమ్మెల్యేలు సభకు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఇది మంచి పద్ధతి కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు .. ఇలా అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకాలు చేసిన వారు తనకు అసెంబ్లీలో కనిపించడం లేదని అన్నారు .. ఈ సందర్భంగా ఆయన వైసీపీకి చెందిన మొత్తం 7రు ఎమ్మెల్యేల పేరులను స్పీకర్ సభలో చదివి వినిపించారు .  ఇక అందులో  ఆకేపాటి అమరనాథరెడ్డి , విరూపాక్షి , తాటిపర్తి చంద్రశేఖర్ , మత్స్యలింగం , విశ్వేశ్వరరాజు , శివప్రసాద్ రెడ్డి , దాసరి సుధ  వంటి వారు ఈ లిస్టులో ఉన్నారు .  ప్రజా ప్రతినిధులుగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారని అటువంటి వారు మీరు మొహం చాటేయటం ఎందుకని కూడా అన్నారు . ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వారి గౌరవాన్ని పెంచేలా ఉండాలని స్పీకర్ వారికి హితువు పలికారు . ఇక మరి ఇప్పుడు ఈ వైసీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: