ఏపీ: గెలిచినా ఏం లాభం లేదు.. అధికార పార్టీపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

frame ఏపీ: గెలిచినా ఏం లాభం లేదు.. అధికార పార్టీపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Divya
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఎమ్మెల్యే  అసెంబ్లీలో మాట్లాడుతూ తాను ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన తర్వాత ఏవేవో చేద్దామనుకున్నానని తెలిపారు. అయితే ఇదే విషయాలను తాను మీడియా సమావేశంలో కూడా వెల్లడించారని కానీ గెలిచిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో తాను ఏమీ చేయలేకపోతున్నాను అంటూ ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం మరొకటి లేదు అంటూ అసెంబ్లీలో మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అయితే ఆ సమయంలో స్పీకర్ రఘురామరాజు కూడా ఇది సమయం కాదంటూ ఎమ్మెల్యేలను హెచ్చరించడం జరిగింది. అయితే ఆ ఎమ్మెల్యే ఏ విషయం పైన అలా నిరాశని తెలియజేశారన్న విషయం పైన ఒక వీడియో వైరల్ అవుతున్నది. ఈ వీడియోని వైసీపీ నేతలు వైరల్ గా చేస్తూ తొమ్మిది నెలల్లోనే కూటమి పాలన ఎలా ఉన్నదో ఎమ్మెల్యేల మాటలలోనే ఇప్పుడు అర్థమవుతున్నది అంటూ సెటైర్లు వేస్తూ ఉన్నారు. అధికార పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేల పనులే జరగకపోతే ఇంతటి అసహనమా అంటూ పలువురు ఆశ్చర్యపోతూ ఉన్నారు.

కానీ ఎమ్మెల్యే వెంకట్రావు మాత్రం ఎలాంటి విషయంలో ఈ అసహనం తెలియజేస్తున్నారనే విషయం పైన ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు.. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎవరికి వారు అనుగుణంగానే మార్చుకొని తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎన్నికల ముందు టిడిపి పార్టీలోకి చేరి గన్నవరం ఎమ్మెల్యేగా టికెట్ ను సంపాదించి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మరి గెలవడం జరిగింది. మొత్తానికి అధికార పార్టీ తొమ్మిది నెలలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా చాలామంది నేతలు ఇప్పటికే అసహనంతో ఉన్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి రాబోయే రోజుల్లో మరింత మంది తెలియజేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: