మంగళగిరిలో నారా లోకేష్ @ 100

frame మంగళగిరిలో నారా లోకేష్ @ 100

RAMAKRISHNA S.S.
మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని, 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను, నూతన సముదాయాలను మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. శ్రీ భగవాన్ మహవీర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. జైన్ సోదరులు యర్రబాలెం గ్రామంలో గత 25 ఏళ్లుగా గోశాల నిర్వహిస్తున్నారు. రెండు ఆవులతో మొదలైన గోశాల 450 ఆవులకు చేరింది. వారికి అండగా నిలబడేందుకు, వారిని ప్రోత్సహించేందుకు, వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసేందుకు నేను, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడకు రావడం జరిగింది. జైన్ సోదరులు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంద‌న్నారు.

మంగళగిరిలో ఆవులన్నీ రోడ్లపై తిరిగే పరిస్థితి. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. ఓ వైపు శ్రీ భగవాన్ మహవీర్ గోశాల, మరోవైపు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా గోశాలను తిరిగి ప్రారంభించడం జరిగింది. మంగళగిరి పట్టణంలో ఆవులు వీధుల్లో తిరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంద‌ని లోకేష్ తెలిపారు. నియోజవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల సమయంలో కోరాను. అప్పుడే అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మంగళగిరిలో నాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రస్థాయిలో మూడో అత్యధిక మెజార్టీ సాధించాను. ప్రజలు నన్ను దీవించారు. నా గౌరవం నిలబెట్టార‌ని లోకేష్ పేర్కొన్నారు.

వారికి నేను రుణపడి ఉంటాను. మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించిన‌ట్టు తెలిపారు. మొదటి విడతలో సుమారుగా 5వేల మందికి ఉగాది తర్వాత ఇళ్ల పట్టాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. రెండో విడత, మూడో విడతలో మిగిలిన ఇళ్ల పట్టాలు అందిస్తాం. కాలువలు, అటవీ భూముల్లో ఇళ్ల పట్టాలకు కొంత సమయం పడుతుందని ఆనాడే చెప్పాను. కేంద్రమంత్రి పెమ్మసాని సహకారంతో రైల్వే మంత్రి గారిని కలిసి రైల్వే భూములు క్రమబద్ధీకరించాలని కోరినప్పుడు సానుకూలంగా స్పందించారు. ఇందుకు పెమ్మసాని గారి కృషి ఎంతో ఉంది. నిడమర్రు గేటువద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి విషయంలో కూడా పెమ్మసాని గారు చొరవ తీసుకున్నార‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: