ఇండియా టుడే: రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్ ?

frame ఇండియా టుడే: రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్ ?

Veldandi Saikiran
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువు.. మరోసారి పోయింది. అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తించడం లేనట్లే తెలుస్తోంది.  చిన్న స్థాయి లీడర్ నుంచి.. న్యూస్ యాంకర్ల వరకు ఎవరు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు గుర్తించుకోవడం లేదు. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్ వివిధ కారణాల వల్ల అరెస్టయిన సంగతి తెలిసిందే.
 ఆ తర్వాత... మరో టాలీవుడ్ నటుడు అచ్చం ఇలాగే చేశాడు. ఇలా వరుసగా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు  నేతలు అలాగే నటీ నటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు. అయితే తాజాగా... ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు సీఎం రేవంత్. అయితే ఈ సందర్భంగా అక్కడే ఉన్న యాంకర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది.
 దీంతో అక్కడ ఉన్నవారందరూ... ఒకసారి గా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అయితే ఇదే శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. అందులోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం జరిగింది.
 సిద్దిపేట జిల్లా గురించి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటూ... సీఎం రేవంత్ రెడ్డి పేరే మర్చిపోయాడు. ఆ తర్వాత సవరించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తలుచుకున్నాడు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరో ఎమ్మెల్యే... తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలోనే నోరు జారాడు. తెలంగాణ ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ ఆ తర్వాత తీరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇలా ఒక్కరోజే వరుసగా సీఎం రేవంత్ రెడ్డి  పేరును మర్చిపోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: