ఇందిరా గాంధీ: సింగిల్ హ్యాండ్ తో ఇండియానే ఏలిన వీరనారి ?

Veldandi Saikiran
మన దేశంలో ఎంతోమంది వీర మహిళలు ఉన్నారు. కానీ అందులో కొంతమంది.. అతి తక్కువ స్థాయిలో ఉన్నత స్థాయిలకు చేరితే... మరికొంతమంది చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటి వారిలో ఇందిరాగాంధీ ఒకరు. ఇందిరాగాంధీ పేరు చెప్పగానే అందరికీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే గుర్తుకొస్తుంది. దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీకి సంబంధించిన విగ్రహాలు అలాగే కాలనీలకు పేర్లు... కొన్ని ఊర్లకు కూడా ఇందిరా గాంధీ పేర్లు పెట్టడం జరిగింది.

ఎందుకంటే ఆమె దేశానికి అందించిన సేవ అంతా ఇంతా కాదు.  దేశ ప్రధానిగా దాదాపు 15 సంవత్సరాలకు పైగా పని చేశారు. 1966 సంవత్సరం నుంచి 1977 సంవత్సరం వరకు  భారతదేశ ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ పని చేయడం జరిగింది.  ఇక 1980 సంవత్సరంలో... రెండో సారి ప్రధానమంత్రిగా పనిచేశారు ఇందిరాగాంధీ.  ఆ సమయంలో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నారు. 1984  సంవత్సరం వరకు ప్రధానిగా కొనసాగారు. అలాగే కేంద్రమంత్రిగా కూడా చాలాసార్లు పనిచేశారు.

 విదేశాంగ మంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా చేపట్టారు ఇందిరాగాంధీ. దేశవ్యాప్తంగా చాలామంది నిరుపేదలకు ఇండ్లను ఇవ్వడం... సంక్షేమ పథకాలు అమలు చేయడం లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక మహిళ అయి ఉండి... ప్రధానిగా ఎదిగి దేశాన్ని వణికించారు. ఏ నాయకులు అందుకొని... ఉన్నత శిఖరాలకు ఇందిరాగాంధీ ఎదిగారు.

 ఇక ఇందిరా గాంధీ... భారతదేశానికి ఎన్నో సేవలు అందించి.. చివరికి దుండగుల కాల్పుల్లో మరణించారు. ఇప్పటికీ ఆమె మరణం విషాదంగానే కొనసాగుతోంది.    ఇక ఇందిరాగాంధీ సంతానం ఇప్పుడు భారతదేశాన్ని ఏలుతున్న సంగతి. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ... దేశ ప్రధానిగా కూడా పనిచేశారు. రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు సోనియాగాంధీ కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. ఇలా ఒక మహిళ అయి ఉండి తన కుటుంబాన్ని కూడా ఓ రేంజ్కి తీసుకువెళ్ళింది ఇందిరాగాంధీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: