
రేవంత్ రెడ్డికి షాక్...అల్లు అర్జున్ మామ షాకింగ్ నిర్ణయం ?
తాజా గారు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైన హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి. కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్లను విస్తరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి. వెంటనే ఆ పనులను ఆపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్ల విస్తరణ చేస్తే పర్యావరణానికి నష్టం జరుగుతుందని కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఇదే వర్క్ పైన నలుగురు ప్రముఖులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
కేబీఆర్ పార్కు దగ్గరే తన ఇల్లు ఉన్న నేపథ్యంలో... తన ఇంటిని కూల్చివేస్తారని భయపడుతున్న చంద్రశేఖర్ రెడ్డి... పిటిషన్ వేయడం జరిగింది. గత నెల రోజుల కిందట ప్రజావాణి లో ఇదే అంశంపై దరఖాస్తు చేసుకున్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.... ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి.
అయితే దీనిపై విచారణ చేసేందుకు సమయం కావాలని హైకోర్టు కూడా ప్రకటన చేసింది. ఇప్పటికే నాలుగు పిటిషన్లు ఉన్న నేపథ్యంలో ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా డీల్ చేస్తుంది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న నందమూరి బాలయ్య అలాగే మాజీ మంత్రి జానారెడ్డి ఇంటిని కూడా తొలగిస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అందులో భాగంగానే చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూడా పోతుందని... తెలుస్తోంది. అందుకే చంద్రశేఖర్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు.