జీవి రెడ్డి రాజీనామాకు పోసాని అరెస్టుకు ఇంత లింక్ ఉందా.. !

frame జీవి రెడ్డి రాజీనామాకు పోసాని అరెస్టుకు ఇంత లింక్ ఉందా.. !

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి .. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాతో కూటమి ప్రభుత్వంలోనూ తెలుగుదేశం పార్టీలను పెద్ద అలజడి చెలరేగింది. సోషల్ మీడియా వేదికగా టిడిపి వీరాభిమానులు అందరూ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. నిబద్ధత కలిగిన జీవీ రెడ్డిని చంద్రబాబు , లోకేష్ వ్యవహార శైలితో పోగొట్టుకున్నారని ఆవేదన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ వీరాభిమానులతో తమ ఆవేదన .. ఆగ్రహాన్ని ఏమాత్రం దాచుకోవటానికి ప్రయత్నించలేదు.

ఈ క్రమంలోనే వారంతా చంద్రబాబు .. లోకేష్ పై సోషల్ మీడియా వేదికగా రాజకీయ దాడికి దిగారు. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉలిక్కిపడినట్టు ఉంది. జివిరెడ్డి రాజీనామా అంశం టిడిపికి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలినట్లు అయింది. ఈ నష్ట నివారణ చర్యలతో పాటు ఈ అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ పెద్ద వ్యూహం పన్నింది. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ  ర‌చ‌యిత వైసిపి మాజీ నాయకుడు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారనే చర్చ తెర‌మీద‌కు వచ్చింది. రాజకీయాల నుంచి పోసాని నిష్క్రమించాన‌ని ఇప్పటికే చెప్పారు.

ఆయనపై కేసులు జోలికి ప్రభుత్వం వెళ్లదని అంతా అనుకున్నారు. కానీ పోసాని ని దాదాపు అందరూ మరిచిపోయారు. ఇలాంటి పరిస్థితులలో రాత్రికి రాత్రే గతంలో పోసాని అనుచిత కామెంట్లపై అరెస్టు చేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు చెప్పటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. హైదరాబాదులో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లిన అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్ళించాలన్నది కూటమి ప్రభుత్వం.. అందులోనూ చంద్రబాబు భావనగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: