ఏపీ: దళిత మహిళపై.. టిడిపి అనుచరుడు లైంగిక దాడి..!

frame ఏపీ: దళిత మహిళపై.. టిడిపి అనుచరుడు లైంగిక దాడి..!

Divya
గత కొంతకాలంగా ఏపీలోని చాలామంది మహిళల పైన నేతలతో పాటు వారి యొక్క అనుచరులు లైంగిక వేధింపుల కేసులు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవలే జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ గురించి వార్తలు వినిపిస్తున్న సమయంలో తాజాగా టిడిపి నేత ఆచ్చెన్నాయుడు అనుచరురాలలో ఒకరైన పెబ్బిలి  రవికుమార్  చేసిన పని తాజాగా బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసకు కుమార్తె అయిన వివాహిత పైన గత కొన్నేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నారట రవికుమార్.



చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో చేరదీసిన  దళిత మహిళా పిన్ని, అలాగే బాబాయ్ రవికుమార్ సైతం శ్రీకాకుళంలో ఉండేటువంటి  ఒక వ్యక్తితో ఆ బాధ్యత మహిళకు సైతం మొదటి వివాహం చేయించారట. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు సృష్టించేలా చేసి ఇద్దరిని విడదీశారట రవికుమార్.. దీంతో ఆ బాధిత మహిళ పైన ఎన్నోసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా రవికుమార్ పై వెల్లడిస్తోంది. ఒకవేళ ఈ విషయం బయట ఎవరికైనా చెబితే తనను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారట.


దీంతో ఆ బాదిత మహిళా చివరికి గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మరి మలేషియాకు తరలించారు. అయితే ఆ బాదిత మహిళా బంధువుల సైతం పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేయగా అసలు విషయం బయట పడుతుందని భయపడి విజయవాడకు తీసుకువచ్చి మరి రహస్యంగా డెలివరీ చేయించారట.. అలాగే ఆస్పత్రి లో కూడా తండ్రి అంటూ తన పేరు రవికుమార్ సంతకం చేశారట. అయితే ఆ వెంటనే దగ్గరుండి మరి రెండో వివాహం రవికుమార్ జరిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఆ బాదిత మహిళా నుంచి డబ్బులు నగలు ఆమెకున్న ఆస్తిని సైతం కాజేసి మరి ఆమెకు నరకం చూపించారట. చివరికి ఆ బాధ్యత మహిళ చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించిందట. ప్రస్తుతం పోలీసులు ఇందుకు సంబంధించి విచారణ కూడా చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: