
పల్నాడు వైసీపీలో బిగ్ వికెట్ డౌన్ .. టీడీపీలోకి జంపింగ్ జపాంగ్..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైసీపీకి ఇప్పటికే వరుసపెట్టి ఎదురు షాక్‌లు తగులుతున్నాయి . ఈ క్రమంలోనే .. పలనాడు జిల్లాలోని వైసీపీకి చెందిన ఓ సీనియర్ నేత కూడా పార్టీ మారెందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆ నేత ఎవరో కాదు.. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే .. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ . కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌కు .. జగన్ 2019 ఎన్నికలలో సీటు ఇవ్వలేదు . మాజీ మంత్రి విడుదల రజనీ కోసం రాజశేఖర్‌ను పక్కన పెట్టిన జగన్ .. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే మర్రిని ఎమ్మెల్సీ చేసి .. క్యాబినెట్‌లో మంత్రి గా తన పక్కన కూర్చోబెట్టుకుంటానని బహిరంగంగా హామీ ఇచ్చారు .
అయితే జగన్ ఆ మాట నిలబెట్టుకోలేదు సరికదా.. విడుదల రజనీకే మంత్రి పదవి ఇచ్చారు . ఇక మర్రి కి ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే ఎమ్మెల్సీ ఇచ్చారు . అది కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇచ్చారు . ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి పగ్గాలు ఇస్తానని హామీ ఇచ్చి మరోసారి షాక్ ఇచ్చి .. తిరిగి రజినీకే చిలకలూరిపేట నియోజకవర్గ పగ్గాలు కట్టబెట్టారు . ఈ పరిణామం తో విసిగిపోయిన మర్రి .. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది .
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల తో ముందు నుంచి మర్రి కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి . ఈ క్రమంలోనే లావు మధ్యవర్తిత్వంతో మర్రి పార్టీ మారేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది . అయితే మర్రి రాకను చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కొంత వ్యతిరేకిస్తునా .. ఎంపీ మాత్రం మర్రి రాజశేఖర్ ను ఎలాగైనా టిడిపిలోకి తీసుకు వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు .