
ఢిల్లీ సీఎం: ఈసారి కూడా మహిళలకే అవకాశం..?
వెనుకబడిన వర్గాల నుంచి ఒకరిని ఉపముఖ్యమంత్రిని కూడా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మహిళలకు, దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. అలాగే ముఖ్యమంత్రి ఎవరనే విషయం పైన పార్టీ పెద్దలు కూడా ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎన్నోసార్లు సమావేశాలను చర్చించారట. ముఖ్యంగా బీజేపీ నేత పర్వేశ్ వర్మ సీఎం రేసులో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈయన మాజీ సీఎం కుమారుడు.
పర్వేశ్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ సీఎం గా బిజెపి పార్టీ నుంచి పనిచేశారట. అయితే ఇప్పుడు తాజాగా మహిళా సీఎం ప్రతిపాదనను తెరమీదకి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈనెల 13వ తేదీన మోడీ విదేశాల నుంచి తిరిగి రాబోతున్నారని అప్పుడే సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బిజెపి నుంచి గెలిచిన నలుగురు మహిళల విషయానికి వస్తే.. షాలియార్ బాగ్ నుంచి రేఖ గుప్తా, అలాగే సజఫ్ గఢ్ నుంచి నీలం పెహాల్వాన్, గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్, వాజీపూర్ నుంచి పూనం శర్మ గెలిచారు. ఇప్పటివరకు ఢిల్లీకి ముగ్గురు మహిళ సీఎంలు అయ్యారట.
అందులో సుష్మా స్వరాజ్ 1998లో సీఎంగా అయ్యారట. ఈమె 52 రోజులు మాత్రమే ఉన్నదట. తర్వాత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ .. ఈమె 15 సంవత్సరాల పాటు ఉన్నదట. అనంతరం అతీష్ రూపంలో మూడో మహిళ ఢిల్లీ సీఎం గా అయ్యారు.. ఇమే నాలుగున్నర నెలలు పదవిలో ఉన్నది.