
పులివెందులకు జగన్ గుడ్ బై చెప్పేస్తాడా.. కడపలో ఏం జరుగుతోంది..?
ఈ క్రమంలోనే జనరల్గా ఉన్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఈసారి ఎస్సీ కేటగిరీ లోకి మారుతుందని అంటున్నారు. అలా మార్చేలా కూటమి ప్రభుత్వ పెద్దలు పై స్థాయిలో చక్రం తిప్పుతారని కూడా అంటున్నారు. అదే జరిగితే పులివెందుల ఎస్ సీలకు రిజర్వ్ అవుతుంది. అప్పుడు జగన్ పులివెందులను పక్కనపెట్టి అయితే జమ్మలమడుగు లేదా కమలాపురం నియోజకవర్గాలలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పులివెందుల తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గంలో వైయస్ ఫ్యామిలీకి వీరాభిమానులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ పార్టీలతో సింబల్ తో సంబంధం లేకుండా వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేసిన 30 వేల ఓట్లు ఈజీగా పడతాయని గతంలోనే అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థి హోదాలో జమ్మలమడుగు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తమ ఫ్యామిలీ కంచుకోట అయిన పులివెందులను వదులుకోవడం వైయస్ ఫ్యామిలీకి ఎంతైనా ఇబ్బందికరమే అని చెప్పాలి.