ఏపీ , తెలంగాణ రాజకీయ పార్టీలకు గుడ్ న్యూస్ ... అసెంబ్లీ సీట్లు పునర్విభజన ప్రక్రియ మొదలు..!
ఇక ఎగ్జాంపుల్ బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ కూడా రాజకీయాలకు కొత్తే .. అప్పటివరకు రాజకీయ నేపథ్యం కూడా తొక్కువే కానీ ఎన్నికల సమయంలో ఆయన రాజకీయ పార్టీల నుంచి టిక్కెట్లు తెచ్చుకున్నారు .. దీని కారణంగా పార్టీలో ఉన్న సీనియర్లు టికెట్ ఆశించిన వారు కూడా కొంత అసహనానికి గురవాల్సి వస్తుంది ఇక ఇతర నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్లను ఇలాగే తప్పిస్తున్నారు. ఇక జగన్ వైసీపీ పార్టీ విషయానికి వస్తే.. ఈ పార్టీ కొత్త తరం నాయకులను రాజకీయాల్లోకి తీసుకువస్తుంది .. సీనియర్లను రాజకీయాలనుంచి తప్పించి సామాజిక వర్గాల ఆధారంగా టికెట్లను ఇస్తుంది .. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఈ రెండు అగ్ర పార్టీల్లో ఉన్న నాయకుల పరిస్థితి అవకాశాలు తక్కువ అన్నట్టుగా తయారైంది .. ఇక దీంతో వైసిపి , టిడిపిలో రెండు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సీట్ల పంపిపై గట్టిగానే కసరత్తులు చేశాయి .. 2017 - 18 మధ్య చంద్రబాబు దీనిపై పెద్ద తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపారు.
అయినా కూడా 2026 వరకు కుదరదని అప్పటి కేంద్రం తేల్చి చెప్పింది .. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ , తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాలు పెంచేందుకు కేంద్రం కసరత్తు లు మొదలుపెట్టింది .. నియోజకవర్గాల పెంపు పై పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానన్న బడ్జెట్ సమావేశాల్లో రెండో విడతలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును అక్కడకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది .. ఇక ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలైతే దాదాపు 6 నెలల సమయం పడుతుంది .. మళ్లీ దీన్ని తిరిగి మళ్ళీ సంవత్సరానికి ఆమోదిస్తే వచ్చే సంవత్సరం నుంచి నియోజకవర్గాల పెంపు జరుగుతుందని అంత అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.