![ఏపీ: సీమలో టిడిపి మహిళా ఎమ్మెల్యే అనుచరులు వీరంగం.. ఏం చేశారంటే..?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/politics/politics_latestnews/rayalasima-mla-bandaru-sravani-anucharulu-sand-vrof81ae8df-c659-4d86-ba32-9db845d73fe8-415x250.jpg)
ఏపీ: సీమలో టిడిపి మహిళా ఎమ్మెల్యే అనుచరులు వీరంగం.. ఏం చేశారంటే..?
ఆ మహిళ ఎమ్మెల్యే ఎవరు కాదు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి.. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆమె అనుచరులు సైతం ఇసుక దోపిడీ చేస్తున్నారట.. ఈ ఇసుక దోపిడీ చేస్తూ ఉండడమే కాకుండా ఈ విషయం పైన అధికారులు ప్రశ్నిస్తే అడ్డుకుంటే ఇక నీ ఇష్టం అంటూ వీఆర్వోని కూడా ఒక నాయకుడు బెదిరిస్తున్నారట. అందుకు సంబంధించి ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ విషయం పైన పోలీసులకు కూడా విఆర్ఓ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
శింగనమల దగ్గర సలకం చెరువు కొరివిపల్లి మార్గంలో గత కొద్ది రోజులుగా వంకలో ఉండే తీసుకొని టిడిపి కార్యకర్తలు నాయకులు అక్రమంగా తరలిస్తూ ఉన్నారట. వీటి పైన పత్రికలలో కథలు రావడంతో అక్కడ రెవెన్యూ అధికారులు కూడా స్పందించి టిడిపి నాయకులు నిల్వ చేసినటువంటి ఇసుక డంపును కూడా సీజ్ చేశారట. ఆసీజ్ చేసిన ఇసుకను కూడా దౌర్జన్యంగా తరలించడానికి జెసిబి టిప్పర్ రావడంతో విఆర్ఓ అడ్డుకున్నారట.. ఈ క్రమంలోనే నార్పల మండలానికి చెందిన ఒక టిడిపి నాయకుడు నరసింహ యాదవ్ ఫోన్ చేసి మరి వీఆర్వో ను బెదిరించారట.. ఎమ్మెల్యే గారు చెప్పి ఉంటే ఇసుక తోలుతున్నామంటూ హెచ్చరించారట.. ఎమ్మెల్యే చెప్పిన లెక్క లేదా అంటూ బెదిరించారట..? ఇసుక తరలించడం తప్పు కదా అన్నా అని వీఆర్వో చెప్పినప్పటికీ.. ఎలా తప్పవుతుంది ఈ విషయాలన్నీ రికార్డు చేసుకో నాకేమీ ఇబ్బంది లేదు అటు ఆ మహిళ ఎమ్మెల్యే అనుచరుడు రెచ్చిపోయారట. మరి వీ విషయం పైన హై కమాండ్ ఎలా సీరియస్ అవుతుందో చూడాలి.