ఏపీ: వైసీపీ నుంచి మరో నలుగురు బయటికి రాబోతున్నారా..?

frame ఏపీ: వైసీపీ నుంచి మరో నలుగురు బయటికి రాబోతున్నారా..?

Divya

ఇటీవల కాలంలో వైసీపీ పార్టీలో నుంచి చాలా మంది నేతలు  వెళ్లిపోతూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడ వైసీపీ నేతలు కానీ, పార్టీ కానీ భయపడడం లేదు.. ఇటీవలే సీనియర్ నేత వైయస్ జగన్ కు అన్ని విధాలుగా తోడునీడగా ఉండే విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తాను ఇకమీదట రాజకీయాలలో ఉండనని చెప్పి తాను వ్యవసాయం చేస్తానని చెప్పి ఇటీవలె రాజీనామా కూడా చేశారు. దీంతో అటు వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ భయపడలేదు.. కానీ పార్టీ మాత్రం  ఒకటి ఫిక్స్ అవుతున్నారు. అదేమిటంటే మరికొంత రాజీనామాలు ఉంటాయనేదే.


రాజ్యసభకు సంబంధించి ఎవరైతే ఊగిసలాడుతున్న వారు ఇద్దరు ముగ్గురు ఉన్నారట.. ఇప్పుడు ఉన్నటువంటి ఏడుగురులో మొత్తం 11 మంది ఉండగా మొన్న ముగ్గురు వెళ్లిపోయారు.. ఇటీవలే విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేశారు. అయితే ఏడుగురులో మరో నలుగురు కూడా వెళ్ళిపోతారట. ఆ నలుగురు ఎవరు..? ఇందులో ఎవరైతే భారీగా పారిశ్రామికవేత్త కలిగినటువంటి వారు ఉంటారు వారే పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారట. అయితే అలా ఎవరెవరు రాజీనామా చేస్తారనే విషయం పైన అంచనాలు వేస్తోందట వైసీపీ పార్టీ క్యాడర్.



ప్రెజర్ అయితే కచ్చితంగా ఉంటుంది.. ఒకవేళ ఇది అయ్యాక లోక్సభ సంగతి చూస్తారా.. ఇందుకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్నది చూడాలి. అయితే విజయసాయిరెడ్డి రిజైన్ వెనుక ఏదో మతాబు ఉందని చాలామంది నేతలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ అసలు విషయం ఏంటన్నది మాత్రం ఇప్పటివరకు అటు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. మరి వైసీపీ పార్టీ నుంచి వెళ్లిపోయి మిగిలిన ఆ నలుగురు ఎవరు తెలియాల్సి ఉన్నది.. ప్రస్తుతం అయితే వైసీపీ క్యాడర్ కూడా అన్ని మార్పులు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: