"పద్మ అవార్డ్స్" లో తెలంగాణకు ఘోర అవమానం.?

frame "పద్మ అవార్డ్స్" లో తెలంగాణకు ఘోర అవమానం.?

Pandrala Sravanthi
గణతంత్ర దినోత్సవం సందర్భం గా దేశంలోని ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డులు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ప్రకటన లో భాగంగా తెలంగాణ రాష్ట్రం పై కేంద్రం వివక్ష చూపిందని, తెలంగాణ వారిని అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ నుంచి కొంత మంది ప్రముఖ వ్యక్తుల పేర్లు పంపగా వారికి అవార్డు ఇవ్వలేదని అన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దివంగత ప్రజా గాయకుడు గద్దర్, గోరేటి వెంకన్న, విద్యావేత్త చుక్క రామయ్య, జయదీర్ తిరుమల రావు  వంటి ప్రముఖుల పేర్లను రాష్ట్రం నుంచి పంపగా వారిలో ఒక్కడికి కూడా అవార్డు ఇవ్వలేదని వారి పేర్లను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ఇలా తెలంగాణకు అన్యాయం చేయడం నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేయడమే అని తెలియజేశారు.. 


139 అవార్డులను ప్రకటించినటు వంటి కేంద్ర ప్రభుత్వానికి కనీసం తెలంగాణ కు ఐదు అవార్డులు ఇవ్వడానికి మనసొప్పలేదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అవార్డుల విషయంపై పీఎం మోడీ కి లేఖ రాయాలని ఆయన అనుకుంటున్నారట. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనటు వంటి కొంతమంది వ్యక్తులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, మందకృష్ణ మాదిగ, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, మాడుగుల నాగఫణి శర్మ,  కేల్ కృష్ణ,  రాఘవేంద్రచార్య పంచముఖికి పద్మ పురస్కారాలు రావడంపై శుభాకాంక్షలు తెలియజేశారు.


వారు ఏ రంగాలు అయితే ఎంచుకున్నారో ఆ రంగాల్లో నిబద్ధతతో పనిచేశారు కాబట్టే పురస్కారాలు అందాయని అన్నారు. ఇక కేంద్రం ప్రకటించిన మొత్తం 139 అవార్డుల్లో 19 మందికి పద్మభూషణ్, ఏడుగురికి పద్మ విభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు  అందించారు. తెలంగాణలో ముఖ్యంగా వైద్య విభాగంలో నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం లభించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: