తిరుప‌తి తొక్కిస‌లాట వెన‌క త‌ప్పు జ‌రిగిందా... రీజ‌న్ ఇదే..!

RAMAKRISHNA S.S.
కొన్ని కొన్ని మ‌న ప్ర‌మేయం లేకపోయినా.. జ‌రుగుతుంటాయి. అయిన‌ప్ప‌టికీ.. వాటిని మోయ‌క‌త‌ప్ప‌దు. అధికార పీఠాల్లో ఉన్న‌వారికి అప‌ప్ర‌ద‌లూ త‌ప్ప‌వు. కార్యాకార‌ణ సంబంధం అంటూ ఏమీ లేక‌పోయినా.. తిరుప‌తిలో చోటు చేసుకున్న ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆవేద‌న‌ను ర‌గిలించింది.. బాధిత కుటుంబాల్లో ఆవేద‌న‌ను మిగిల్చింది. మొత్తంగా ఆరుగురు మృతి చెందారని ప్రాధ‌మిక స‌మాచారం వ‌చ్చినా.. గంట‌లు గడుస్తున్న కొద్దీ మ‌రో ఒక‌టో రెండో ప్రాణాల‌కు ర‌క్ష‌ణ ఉంటుంద‌ని చెప్ప‌లేమ‌న్న వైద్యుల స‌మాచారం మ‌రింత కుంగ దీస్తోంది.

అయితే.. ఈ తొక్కిస‌లాట కామ‌న్‌గానే జ‌రిగిందా?  అధికారుల త‌ప్పా.. పాల‌క మండలి ప‌ర్య‌వేక్షణ లోప మా?  లేక భ‌క్తులే అత్యుత్సాహానికి గురయ్యారా?  అనే విష‌యాలను ప్ర‌చారం చేయ‌డంలో జ‌రుగుతున్న త‌ప్పు లు మ‌రిన్ని ఆవేద‌న‌ల‌కు, ఆక్రోశాల‌కు దారితీస్తున్నాయి. `త‌ప్పు జ‌రిగింది. దీనిని త‌గ్గించి చూపే ప్ర‌య‌త్నం ఎందుకు?  పోయిన ప్రాణం వ‌స్తుందా? ` అని ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పుష్ప‌-2 వ్య‌వ‌హారంపై  స్పందిస్తూ వ్యాఖ్యానించారు.

ఇది వాస్త‌వం కూడా. పోయిన ప్రాణాలుఎలానూ తిరిగి రావు. ఈ నేప‌థ్యానికి ఎలాంటి రాజ‌కీయ మ‌ర‌క‌లు, మ‌చ్చ‌లు కూడా లేవు. దీంతో వాస్త‌వాలు ఒప్పుకోవ‌డంలో త‌ప్పులేదు. ఎంత మంది మృతి చెందార‌న్న అంశంపైనా క్లారిటీ ఉంది.. మ‌రింత మంది గాయ‌ప‌డ్డార‌న్న‌ది కూడా తెలుస్తూనే ఉంది. కానీ, నిజాలు ఒప్పుకొనేందుకు.. కొన్ని వ‌ర్గాలు ముందుకు రావ‌డం లేదు. మృతుల సంఖ్య‌ను త‌గ్గించి చూపించే ప్ర‌య‌త్నం లేదా.. బాధితుల వైపున‌కే త‌ప్పు ను నెట్టే ప్ర‌య‌త్నం స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం ఒక ఎత్త‌యితే.. అస‌లు దీనికి ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం కూడా మ‌రో గొప్ప విశేష‌మ‌నే చెప్పాలి.

త‌మ్ముడు త‌న వాడైనా ధ‌ర్మం చెప్పాలి. తిరుప‌తి తొక్కిస‌లాట వెనుక ఎలాంటి రాజ‌కీయం లేదు. కేవ‌లం నిర్ల‌క్ష్యం.. మ‌రికొంత అశ్ర‌ద్ధ‌.. క‌నీసం ఎంత మంది వ‌స్తారో అంచ‌నా వేయ‌లేని దౌర్భాగ్యం. వెర‌సి ప్రాణా లు తీసింది. దీనిని కూడా దాచేసి.. ఏదో భ‌క్తుల‌దే త‌ప్పు అన్న‌ట్టుగా ఓ వ‌ర్గం మీడియా ప్ర‌చారం చేయ డం.. ప్ర‌జ‌ల‌కుఎలాంటి సంకేతాలు ఇస్తున్న‌ట్టు?!  జ‌రిగిన ఘ‌ట‌న‌ను హుందాగా ఒప్పుకొనేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉన్నా.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు తిరుప‌తి ఘ‌ట‌న‌ను త‌క్కువ చేసి చూపించేందుకు ప్ర‌య‌త్నించ‌డం ద్వారా.. జుగుప్సాక‌ర జ‌ర్నలిజానికి బీజాలు వేయ‌డం స‌రికాద‌న్న వాద‌న మేధావుల నుంచే వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: