తిరుమల శ్రీవారి సన్నిధిలో.. పెను విషాదం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో... బుధవారం తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో ఏకంగా ఆరుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మరో 25 మందికి పైగా ఆసుపత్రి పాలు అయ్యారట. అందులో మరి కొంతమంది మరణించే అవకాశాలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
తిరుమల సన్నిధి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం... తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. పోలీసుల భద్రత వైఫల్యం నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఒకసారి గా... దర్శన టికెట్ల దగ్గర గేట్లు ఓపెన్ చేయడంతో.... భక్తులు... ఒకరినొకరు తోసుకున్నారని తెలుస్తోంది. అయితే వాళ్లను అదుపు చేయడంలో పోలీసులు... దారుణంగా విఫలమైనట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన పై... టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు స్పందించారు. ఇలాంటి సంఘటన జరగడం అత్యంత హేయానియమని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో... ఏపీ ప్రభుత్వాన్ని అలాగే టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడును టార్గెట్ చేసింది వైసీపీ పార్టీ.
ఈ సంఘటనకు ముఖ్య కారణం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అంటూ... ఫైర్ అవుతున్నారు వైసీపీ పార్టీ నేతలు. మొన్న అల్లు అర్జున్ కారణంగా రేవతి మృతి చెందిందని అతన్ని అరెస్టు చేసారు. అచ్చం ఇప్పుడు తిరుమల లో జరిగిన ఘటనకు.. బిఆర్ నాయుడు ను అరెస్టు చేయడమే కాదు.. అతన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు వైసిపి నేతలు. లేకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని వైసిపి నేతలు హెచ్చరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారి సన్నిధిలో.. పెను విషాదం పై కూటమి సర్కార్ అలెర్ట్ అయింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో.. పెను విషాదం పై చర్యలు తీసుకోనుంది.