నాగబాబుకు మంత్రి పదవి అప్పుడే.. కూటమి ఆలస్యం వెనుక అసలు కారణాలివే!
అయితే డైరెక్ట్ గా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడానికి అధికారాలు లేవు. అందువల్ల ఆయనను మొదట ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. మార్చి నెలలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని మరో నలుగురి రాజీనామాలు ఆమోదించాల్సి ఉందని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్సీ స్థానాలలో ఒక స్థానాన్ని నాగబాబుకు కేటాయిస్తారని సమాచారం అందుతోంది.
నాగబాబుకు మంత్రి పదవి దక్కితే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. శాసన మండలిలో సైతం బలం పుంజుకునే విధంగా కూటమి ప్రణాళికలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ వ్యతిరేకత రాకుండా ఒకింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
ఏపీలో కూటమి మరో 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండేలా అడుగులు వేస్తోంది. పథకాల అమలు ఆలస్యమైనా ఈ 2026 నాటికి అన్ని పథకాల అమలు జరిగేలా కూటమి ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఏపీలో కూటమిపై కొంతమేర వ్యతిరేకత ఉన్నా వైసీపీ పుంజుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. వైసీపీ రాష్ట్రంలో పుంజుకోవాలంటే మరికొన్ని సంవత్సరాల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. ఏపీలో కూటమికి గట్టి పోటీ ఇచ్చే మరో రాజకీయ పార్టీ లేకపోవడం గమనార్హం. బీజేపీ మద్దతు సైతం టీడీపీ, జనసేనలకు ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో అనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం.