నిజంగా ఇది మిరాకిల్.. చనిపోయిన వ్యక్తిని స్పీడ్ బ్రేకర్ బ్రతికించింది?
అవును, మీరు విన్నది నిజమే. చనిపోయాడని అనుకున్న వ్యక్తికి అంత్యక్రియలు చేస్తుండగా.. ఒక్కసారిగా పైకి లేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటి ఘటనలనే మిరకిల్ అని అంటూ ఉంటారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు మనుషులు బెంబేలెత్తిపోటు ఉంటారు. వైద్యులు, ప్రజలు సరిగ్గా గమనించక ఒక్కోసారి తొందరపాటు చర్యలు చేస్తుంటారు. అలాగే ఇక్కడ వైద్యులు తొందర పడినట్టు తెలుస్తోంది. గుండెపోటుకు గురైన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసినా చలనం లేకపోవడంతో చనిపోయినట్లు తేల్చారు. వారు చెప్పిన మాట విని.. అంత్యక్రియలు నిర్వహించేందుకు అంబులెన్స్ ద్వారా ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు అతని కుటుంబ సభ్యులు. ఇక్కడే ట్విస్ట్ జరిగింది.
అవును, అంబులెన్స్ డ్రైవర్ చేసిన ఓ తొందరపాటు పని వల్ల అతడు లేచి కూర్చున్నాడు అంటే మీరు నమ్ముతారా? విషయంలోకి వెళితే... మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన 35 ఏళ్ల పాండురంగ్ డిసెంబర్ 16వ తేదీన అనుకోకుండా ఆయన గుండెపోటుకు గురై ఒక్కసారిగా నేలకొరిగాడు. విషయం గమనించిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే వైద్యులు పాండురంగ్‌కు సీపీఆర్ కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతడిలో అస్సలు చలనం లేకపోయే సరికి, వైద్యులు పాండురంగ్ చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అంతా విపరీతంగా ఏడుస్తూ.. అంత్యక్రియలు ఏర్పాట్లు చేయమని గ్రామస్థులు, బంధువులకు పురమాయించారు. దీంతో బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ.. శోకాలు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో పాండురంగ్ మృతదేహంకోసం ఇంట్లో వ్యక్తులు, బంధువులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంబులెన్సులోనే పాండురంగ్‌ను ఇంటికి తీసుకు వచ్చేందుకు పయనమవ్వగా మార్గ మధ్యంలో ఓ స్పీడ్ బ్రేకర్ రాగా.. అంబులెన్స్ డ్రైవర్ చూసుకోలేదు. దీంతో వాహనం ఒక్కసారిగా భారీ కుదుపునకు గురైంది. అప్పుడే పాండురంగ్ శరీరం కూడా పైకి కిందకు పెల్లుబికినట్టు కుదుపులకు గురైంది. కట్ చేస్తే... అతడిలో చలనం మొదలైంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ డ్రైవర్‌కు విషయం చెప్పి మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లమని సూచించారు. అలా మరో ఆస్పత్రికి తీసుకు వెళ్లగా.. పాండురంగ్ బతికే ఉన్నట్లు చెప్పిన వైద్యులు అతడికి యాంజియోప్లాస్టీ చేయాలని సూచించారు. ఇక ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు బంధువులకు తెలియజేయగా.. అంత్యక్రియల ఏర్పాట్లను మధ్యలోనే ఆపేసి ఆస్పత్రికి తరలి వచ్చారు. ఈ క్రమంలో వైద్యులు యాంజియోప్లాస్టీ సర్జరీ చేయగా.. 2 వారాల తర్వాత డిశ్చార్జీ చేశారు. ప్రస్తుతం పాండురంగ్ చాలా యాక్టివ్ గా తయారయ్యాడు. ఇక చనిపోయాడనుకున్న వాడు తిరిగి రావడంతో గ్రామస్థులు అంతా కధలుకధలుగా చెప్పుకుంటున్నారు. పాండురంగ మృత్యుంజయుడు అంటున్నారు మరి.